సీజేఐ రమణ వ్యాఖ్యలు జగన్ టీమ్‌ గురించేనా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ తెలంగాణలో జిల్లా కోర్టులను ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటీవల కొందరు మిత్రులు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్తున్నారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆక్షేపించారు. న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ.. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్తున్నారన్నారు. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు.

అంతే కాదు.. వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు మిత్రులు కోర్టులను తప్పుబడుతున్నారని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు.. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సూచనలు చేస్తున్నానన్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ.. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయదని స్పష్టం చేశారు.

వ్యవస్థ ప్రయోజనం, సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవవస్థకు ముఖ్యమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ స్పష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారని.. పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులేనని  సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. అయితే..
పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమని.. నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు.

అయితే.. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇటీవల న్యాయ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న జగన్‌ టీమ్‌ గురించేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమావేశంలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ.. అన్ని వర్గాల వారు మహోన్నత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారని కితాబిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: