నెలకు పది కాన్పులు చేయండి.. విడదల రజిని ఆదేశాలు

ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన  వైద్యసేవలు అందించాలంటే వైద్యాధికారులు, ప్రభుత్వ అధికారులు సహకరించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదర రజని అధికారులకు సూచించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు, వైద్యులు దృష్టిసారిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మెరుగవుతాయన్న ఆమె.. కోట్ల రూపాయల విలువైన పరికరాలు ఉన్నా కొన్ని చోట్ల టెస్టులు బయట చేయించుకోవాలని ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు బాగా ఉండాలని.. కనీసం నెలకు 10 కాన్పులు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎంఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేసే పరికరాల విషయంలో రాజీ పడొద్దని సూచించిన మంత్రి విడదల రజని.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్యశాఖలో ప్రోఫెషనల్ ఐడీలు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్పత్రులు,ల్యాబ్ ల మ్యాపింగ్ ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రుల్లో మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణా లోపాలు, టాయిలెట్లు సరిగా లేక పోవటం చిన్న సమస్యలే ప్రజలను బాగా ఇబ్బంది పెడతాయని మంత్రి విడదల రజని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నందువల్లే అవి పెద్ద సమస్యలుగా తయారై ప్రభుత్వ ఆస్పత్రులకు అప్రతిష్ట వస్తోందంటూ మంత్రి విడదల రజని క్లాస్‌ పీకారు. మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే జాతీయ హెల్త్ మిషన్ నిధులు మురిగిపోతున్నాయని మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔషధాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు బయట మందులు ఎందుకు రాయాల్సి వస్తోందని మంత్రి విడదల రజని నిలదీశారు. పరిశుభ్రత కోసం ఏజెన్సీలను నియమించుకున్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు, దోమలు ఎందుకు  ఉంటున్నాయని అధికారుల్ని మంత్రి విడదల రజని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం నిజమే అయినా ఇలాంటి విషయాల్లో మంత్రుల పర్యవేక్షణ కూడా అవసరమే.. సకాలంలో శాఖలో జరుగుతున్న పనులను సమీక్షించుకుని.. అధికారులతో పని చేయిస్తే మంచి ఫలితాలు రాబట్టొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: