సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహం రాజకీయం?

సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే ప్రచారం కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రచారంతో కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతో ఉన్నారని మంత్రి తలసాని విమర్శిస్తున్నారు. స్వార్ధ  రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడుతున్నారు.

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీ  అంటే మాకు ఎంతో గౌరవమన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహం పరిసరాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం  దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగిస్తారని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని.. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జస్టిస్ అమర్నాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ లను సంప్రదించిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వివరించారు.ప్రస్తుతం ఉన్న పార్క్ ప్రాంతాన్ని మరింత విస్తరించి 60 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు గాంధీ జయంతి, వర్ధంతి లకు మాత్రమే హాజరై గాంధీ పార్క్ అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం ఏంటని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. ఇప్పుడు గాంధీ పార్క్ అభివృద్ధి జరుగుతుంటే అక్కసుతో నిరాధార విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రాజకీయ చదరంగంలో మన మహాత్మా గాంధీ కూడా ఓ పావుగా మారిపోయారా అని ఈ ఘటన చూస్తే అనిపిస్తోంది. మరి ఎవరి వాదన రైటు.. కాంగ్రెస్‌ నిజంగానే రాజకీయం చేస్తోందా.. టీఆర్ఎస్‌ నేతలు పార్కును అభివృద్ధి చేస్తారా.. చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: