దమ్ముందా?: అసదుద్దీన్‌కు జగ్గారెడ్డి అదిరిపోయే సవాల్?

తెలంగాణలో రాజకీయ సవాళ్లు సాగుతున్నాయి. అనుకోకుండా ఈ పొలిటికల్ వార్ కాంగ్రెస్‌, ఎంఐ ఎం మధ్య మొదలైంది. కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి.. ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై అసదుద్దీన్ చేసిన విమర్శలకు స్పందించిన జగ్గారెడ్డి ఆయనకు సవాల్ విసిరారు. తాను  హైదరాబాద్ పార్లిమెంట్ లో పోటీ చేసి గెలుస్తానని.. అసద్ కు మెదక్ లో పోటీ చేసే దమ్ముందా.. హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటు లో పోటీ చేస్ దమ్ముందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. బండి సంజయని  సీపీ  చెంప పగల గొట్టినా..ఆయన పౌరుషం లేదని.. ఆయన  జనాన్ని ఎలా కాపాడతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ విఐపి ఇంట్లో కుక్కల లెక్క మారిపోయారని.. ఓనర్ బయటకు రాగానే సైలెంట్ అయిపోతుందని.. అలాగే ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ అక్రమ సంబందం కొనసాగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు.

అసద్ కు మెదక్ లో పోటీ చేసే దమ్ముందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటు లో పోటీ చేస్ దమ్ముందా అని నిలదీశారు. జనం రక్తం తాగిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇస్తారా అని ప్రశ్నించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి.. అసలు అసద్.. రాహుల్ కి సవాల్ చేయాల్సిన అవసం ఏముందన్నారు.

తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి వివరించారు. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీవు జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే.. ఎందుకు మాట్లాడటం లేదు.. రాహుల్ గాంధీ.. కుటుంబం అంతా దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం.. అలాంటి కుటుంబాన్ని సవాల్ చేస్తావా..? అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: