జగన్‌కు హైకోర్టు బిగ్‌షాక్‌.. మళ్లీ తలనొప్పి స్టార్ట్‌?

ఏపీ సీఎం జగన్‌ కు ఏపీ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. అమరావతిపై తాము ఇచ్చిన తీర్పును ఎంత వరకూ అమలు చేశారో చెప్పాలంటూ స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిపై హైకోర్టు గతంలో జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని... రైతుల ప్లాట్లు నెలలోగా అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయలేమంటోంది.


అంత తక్కువ గడవులో అమలు చేయడం అసాధ్యమంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ నివేదిక కూడా సీఎస్ సమర్పించారు. ఇప్పుడు రైతులు మీరు ఇచ్చిన తీర్పును సీఎం అమలు చేయడం లేదంటూ మరోసారి హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసారు. ఇప్పుడు ఈ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీరు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదని రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధుల్లేవవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని రైతుల లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


ఆ వాదనపై స్పందించిన ఏపీ హైకోర్టు.. అమరావతిపై ఇప్పటి వరకూ ఏం చేశారో చెప్పేలా స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తర్వాత విచారణను జులై 12కు వాయిదా వేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి.  మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఆరునెలల లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని కోర్టు ఆదేశించింది.


అంతేకాదు.. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని... రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. అసెంబ్లీకి లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని... అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఏ ఆఫీసును కూడా తరలించకూడదని... పిటిషనర్లందరికీ ఖర్చుల కింద తలా 50వేలు చెల్లించాలని గతంలో హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: