చంద్రబాబును గుంజీలు తీయిస్తానంటున్న వాసిరెడ్డి?

రాష్ట్ర మహిళాకమిషన్‌ పై ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే ఇక్కడికి పిలిపించి గుంజీలు తీయిస్తామన్నాంటున్నారు కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. విజయవాడ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, బోండా ఉమాకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై  ఎలాంటి సమాధానం చెప్పని సంగతి తెలిసిందే.. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత ఏ తరహా చర్యలు తీసుకుంటామో వివరిస్తామని కమిషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి పద్మ తెలిపారు.

కమిషన్ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు, ఉమా వచ్చి వివరణ ఇస్తారని ఎదురుచూశామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. వారు రాకపోవడంతో తదుపరి చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. విజయవాడ ఆస్పత్రి ఘటనలో చంద్రబాబు, ఉమా 10 తప్పులు చేశారని వారిపై కమిషన్ అభియోగాలు మోపింది. ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్ కు ఉందని వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు  వనిత ఇచ్చిన వినతి  పత్రాన్ని పరిగణనలోకి తీసుసుకుంటామని... వైసీపీ నేతలు తప్పులు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ను అడ్డుకున్నారన్న కారణంతో చంద్రబాబుకు కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లు జారీ చేశారు. నిన్న చంద్రబాబుతో పాటు టీడీపీ నేత బోండా ఉమ కూడా తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనన్నారు. కానీ ఈ విచారణకు చంద్రబాబు, ఉమ డుమ్మా కొట్టారు. దీంతో చంద్రబాబు తీరుపై వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాధితురాలికి భ‌రోసా ఇవ్వడానికి వ‌చ్చిన‌ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్ను బెదిరిస్తారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

అత్యాచార బాధితురాలి గదిలో చంద్రబాబు కేకలు వేస్తారా అంటూ వాసిరెడ్డి పద్మ నిలదీశారు.  మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన ప‌నికి స‌మ‌న్లు ఇవ్వక‌పోతే.. చ‌ప్పట్లు కొడ‌తారా అని కూడా గతంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ పద్మ  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: