ఒక్క ఐడియా చెప్పు గురూ.. వైసీపీ నేతల పాట్లు చూస్తే జాలేస్తోందే..!
అయితే.. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఉంది. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ, సహజంగా అధికార పార్టీ నేతలు.. ప్రజల వద్దకు వస్తే.. ప్లస్సుల కంటే కూడా మైనస్‌లపైనే ప్రజలు ప్రశ్నిస్తారు. తమకు జరుగుతున్న మంచిని ఒకరిద్దు చెప్పినా.. ఎక్కువ మంది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలనే ప్రశ్నిస్తారు. దీని నుంచి తాము బయటపడడం.. వారికి సమాధానం చెప్పడం.. అధికార పార్టీ నేతలకు ఇప్పుడు ప్రధాన కర్తవ్యం.
ఒకవైపు తాజాగా విద్యుత్ చార్జీలు పెంచారు. మరోవైపు... ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా.. కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఫిర్యాదులు.. సూచనలు.. సలహాల మేరకు దాదాపు కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో 7 జిల్లాలను ప్రజలు అంగీకరించడం లేదు. అదేసమయంలో పేర్లు కూడా మార్చాలని డిమాండ్‌చేస్తున్నారు. వీటిలో కాకినాడ నుంచి అన్నమయ్య జిల్లా వరకు ఉన్నాయి. అదేసమయంలో చెత్త పన్నుపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు కనిపిస్తోంది. ఈ మూడు అంశాలపై.. ప్రజాప్రతినిధులు.. ప్రజలకు ఆన్సర్ ఇవ్వాలి.
ప్రభుత్వం వీటి విషయంలో ననిర్ణయం అయితే... తీసేసుకుంది కానీ.. వీటిని ఎలా అధిగమించాలో మాత్రం చెప్పలేదు. అంతేకాదు.. మీరు ప్రజల్లోకి వెళ్లండి.. సంక్షేమాన్ని వివరించండి.. అని సీఎం జగన్ చెబుతున్నారు కానీ.. సమస్యలపై ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి.. ప్రజలను ఎలా సంతృప్తి పరచాల అని దిశానిర్దేశం చేయలేదు.దీంతో ఆయా సమస్యలపై ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలనేది నాయకులకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో ఒక్క ఐడియా ఉంటేఏ చెప్పు గురూ.. అంటూ.. తమకు తెలిసిన నాయకులను ప్రాధేయ పడుతున్నారట. మరి ఎవరు ఎలాంటి ఐడియాలు ఇస్తారో చూడాలి.