
చంద్రబాబును టీడీపీ నేతలు ఎందుకు నమ్మడం లేదు.. ఆ భరోసా లేదా..!
అంటే.. అధికారం కోసం.. అగ్రనాయకులు ఎలా తపిస్తున్నా.. ఏం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు బాగానే పనిచేస్తు న్నారు. జెండాలు మోసే దగ్గర నుంచి అధికార పార్టీ నేతల కేసుల ను ఎదుర్కొనే వరకు కూడా .. కార్యకర్తలు.. నాయకులు.. క్షేత్రస్థాయిలో బలంగా తిరుగుతున్నారు. ఇదే పార్టీకి వెన్నుదన్నుగా మారుతోంది. ఈ ధైర్యంతోనే పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చేస్తుందని.. అగ్రనాయకులు భావిస్తున్నారు. ఆశలు కూడా పెట్టుకున్నారు.
అయితే.. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు వేసే అడుగులు క్షేత్రస్థాయిలో చర్చకుదారితీస్తున్నాయి. ఎందుకంటే.. పార్టీని బలంగా నిలబెట్టేందుకు క్షేత్రస్థాయిలో అందరూ పనిచేస్తున్నారు. ఇది మా నియోజకవర్గం.. ఇక్కడ పార్టీ గెలవాలని .. అనే తపన వారిలో కనిపిస్తోంది. అయితే.. రేపు పొత్తులు అంటూ.. ఆయా నియోజకవర్గాలను వేరే పార్టీకి.. కట్టబెడితే.. పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు క్షేత్రస్థాయిలో నేతలకు కూడా చర్చకు దారితీస్తోంది. ఏ నాయకుడు అయినా.. ఏ కార్యకర్త అయినా.. కష్టపడేతది.. పార్టీ అధికారంలోకి వస్తే.. లేదా.. తాము నమ్ముకున్ననాయకుడు గెలిస్తే.. తమకు ఏదో కొంత మేలు జరుగుతుందనే.
కానీ.. రేపు వేరే పార్టీ నాయకుడికి టికెట్ ఇచ్చి.. ఆయన గెలిస్తే.. రేపు మా పరిస్థితి ఏంటి..? అసలు మమ్మల్ని పట్టించుకుంటాడా? అనేది వీరిమాట. అందుకే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న క్షేత్రస్థాయిలో కేడర్ . చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట. దీనిని బట్టి.. చంద్రబాబు ఆలోచన ఎలా ఉండాలో చూడాలని అంటున్నారు సీనియర్లు.