మోదీని కలవనున్న కేసీఆర్? అదే టార్గెట్!
ఇవాళ్టి టీఆర్ఎస్ఎల్పీకి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ ఆహ్వానించారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీకి జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లకు కూడా ఆహ్వానం వెళ్లింది. వీరితో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. ఇవాళ్టి తెరాస శాసనసభాపక్ష సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లపై టీఎస్ఎల్పీలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా ధర్నాలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన కేసీఆర్.. ఆ విధంగా పార్టీ నేతలను ఈ భేటీ ద్వారా సమాయత్తం చేయనున్నారు. ధర్నాలు, నిరసనలకు టీఆర్ఎస్ఎల్పీ భేటీలో రూపకల్పన చేసి యాక్షన్ ప్లాన్ అందించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల గురించి కేంద్రాన్ని మరోసారి అడగాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కేంద్రమే కొనాలని సీఎం కేసీఆర్, మంత్రులు ప్రధానిని కోరనున్నారు.
బీజేపీపై అన్నివిధాలుగా పోరాడేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోలుపై ఉద్ధృతమైన పోరాటాలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్.. అటు ఢిల్లీ స్థాయిలోనూ పోరాటానికి రూపకల్పన చేస్తోంది. మరి ఈ పోరాటంలో పై చేయి ఎవరిది అవుతుందో.. అటు బీజేపీ కూడా కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు ఆలోచిస్తోంది.