జగన్ ఐడియా టీడీపీదే.. కాని చెప్పుకోలేని పరిస్థితి...!
నిజానికి ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం అంటే.. అంత ఈజీకాదు. అయినప్పటికీ.. 2019లోనే సీఎం జగన్ ప్రకటించిన మేరకు (అప్పట్లో రూ. కోటి అని ప్రకటించారు) ఇప్పుడు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వనున్నట్టు చెప్పారు. నిజానికి ఇది రాష్ట్ర చరిత్రలోనే మరోరకంగా చెప్పాలం టే.. దేశంలోనే ఏ అసెంబ్లీలోనూ.. జరగని పరిణామం. అయితే.. దీనిపై టీడీపీలో చర్చ జరిగింది. ఈ సంద ర్భంగా పార్టీ కీలకనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. `ఈ ఐడియా మనదే``అని చంద్రబాబు దగ్గర నిట్టూర్చారు.
అంతేకాదు.. అప్పట్లో మనమూ.. 50 లక్షల చొప్పున ఇవ్వాలని అనుకున్నామని.. అయితే.. కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. ఐడియా మనదే అయినా.. దీనిని అమలు చేయలేదు కనుక.. ఏం చెప్పుకొం టాం. అని బదులిచ్చారు. అయినా.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఆర్భాటంగా ఈ నిధులు ప్రకటించినా.. నిధులు విడుదల చేయడం అంత ఈజీకాదని.. చెప్పారట. రాబోయే రోజుల్లో ఈ నిధుల్లో ఏమైనా అవకతవకలు జరిగితే.. ఎత్తి చూపేందుకు మనకు అవకాశం లభించిందని.. అన్నారట.
అయితే.. ఈ సమయంలో మరో కీలక నాయకుడు బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ.. ఇవన్నీ.. మనకు వచ్చేలా లేవని.. వాళ్లకి వాళ్లే ఇచ్చిపుచ్చుకునేందుకు ప్రవేశ పెట్టినట్టుగా ఉందని.. అయినా.. రూ.2 కోట్లతో నియోజకవర్గంలోఎలాంటి అభివృద్ది పనులు చేస్తారో చూద్దామని.. అన్నారట. ప్రస్తుతం ఈ రెండు కోట్ల రూపాయల విషయం ఆసక్తిగా మారింది.