
అచ్చెన్న దెబ్బకు టీడీపీలో కుతకుత.. ఏం జరుగుతోందంటే..!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అవకాశం దక్కితే...అస్సలు వదులుకునే పరిస్థితిలో నేటి నేతలు లేరం టే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. అసలు అవకాశమే దక్కడం గగనంగా ఉన్న టీడీపీలో ఏ మాత్రం ఛాన్స్ చిక్కినా.. నాయకులు రెచ్చిపోతున్నారు. అయితే.. వీరి వల్ల.. సీనియర్లకు ముఖ్యంగా పార్టీలో కొన్ని ఆశలు పెట్టుకున్న నాయకులు వెనుకబడి పోతున్నారు. దీంతో పార్టీ అధిష్టానానికి వీరిని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పాలి. అందుకే.. ఇటీవల కాలంలో కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
తాజాగా చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లడంలేదు. దీంతో సభలో మాట్లాడే అవకాశం.. సభను నడిపించే అవకా శం పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నకు దక్కింది. అయితే.. ఆయన దూకుడు రెండు రోజులుగా ఎక్కువగా ఉండ డంతో మిగిలిన నాయకులకు మాట్లాడే ఛాన్స్ లభించలేకుండాపోయింది. ఇదే విషయం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. పార్టీలో నెంబర్ 2 నాయకుడు.. అంటే.. ఇప్పటి వరకు నారా లోకేష్ అనే భావనే ఉంది. కానీ, అచ్చెన్న దూకుడుతో లోకేష్ వెనుకబడిపోయారనే వాదన వినిపించింది. మరోవైపు.. అధికార పార్టీ కూడా లోకేష్‌ను మరింత చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందనే వాదన తెరమీదికి వచ్చింది.
ఎందుకంటే.. ఇతరత్రా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రం.. మీడి యా ఫోకస్ అంతా కూడా ప్రతిపక్షంపై నే ఉంటుంది. ఈ సమయంలో కీలకమైన లోకేష్ డమ్మీ అయిపోతే .. మున్ముందు పరిణామాలు మరింత తీవ్రతర మయ్యే ప్రమాదం ఉందని అంచనాలు వచ్చాయి. ఇదే విషయం.. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. దీంతో అలెర్టయిన చంద్రబాబు అచ్చెన్న ను కొంత తగ్గాలని సూచించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో మళ్లీ లోకేష్ దూకుడు ప్రారంభించారు. అయితే.. ఇప్పుడు ఇదంతా చర్చకు రావడంతో అచ్చెన్న మానసికంగా ఇబ్బంది పడుతున్నారని.. గుసగుస వినిపిస్తోంది మొదటి నుంచి లోకేష్‌కే బాద్యతలు అప్పగిస్తే.. బాగుండేదని.. తనకు ఎందుకని.. ఆయన కీలక నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ పరిణామం.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై డడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.