ఉద్యోగులకు జగన్ వెన్నుపోటు? బయటపెట్టిన కమిటీ..?
ఆ పీఆర్సీ ఉద్యమం సందర్భంగా బాగా వినిపించిన మాట.. అశుతోష్ కమిటీ నివేదికను బయట పెట్టాలి అని.. కానీ ఉద్యోగులు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం ఆ కమిటీ ఏమని నివేదిక ఇచ్చిందో వెల్లడించలేదు. ఆ అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టనే లేదు. అయితే.. మొత్తానికి ఉద్యోగులు ఉద్యమం చేసిన తర్వాత.. ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కానీ.. మొదట ఇస్తామన్న 23 శాతం ఫిట్‌మెంట్‌కే ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్ప.. ఉద్యోగులు కోరినట్టు కనీసం 30 శాతం ఫిట్ మెంట్ మాత్రం ఇవ్వలేదు.
సరే.. ఆ 30 శాతం సంగతి పక్కకు పెట్టి.. కనీసం ఫిట్‌మెంట్‌గా ఇచ్చిన 27 శాతాన్నయినా కంటిన్యూ చేయాలని ఉద్యోగ సంఘాలు వేడుకున్నాయి. కానీ జగన్ సర్కారు మాత్రం 23 శాతాన్ని దాట లేదు.. చివరకు ఉద్యోగులు చలో విజయవాడ వంటి కార్యక్రమం ద్వారా సత్తా చాటిన తర్వాత కూడా ప్రభుత్వం తన 23 శాతం గీతను ఏమాత్రం దాట లేదు. ఏదో.. ఒకటి, రెండు చిన్న కోర్కెలు తీర్చి ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చేయగలిగింది. ఉద్యోగులు కూడా ఇంతకు మించి ఏమీ సాధించలేమని నిర్ణయించుకుని రాజీ కొచ్చేశారు.
కానీ.. ఇప్పుడు అసలు అశుతోష్ మిశ్రా కమిటీని ప్రభుత్వమే విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలకు చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు అశుతోష్ మిశ్రా కమిటీను ప్రభుత్వం విడుదల చేసి సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ కమిటీ మూల వేతనం పై 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఏ లేదా గరిష్టంగా26 వేలు రూపాయలను సిఫారసు చేసింది. అంటే ఈ కమిటీ ఫిట్‌మెంట్‌ను 27%గా ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం మాత్రం 23%తోనే సరిపెట్టిందన్నమాట.