ఏమౌతుందో: రేపే రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఘట్టం..?
ఆ తర్వాత షరతులతో చర్చలకు ఒప్పుకున్న రష్యా చర్చలకు వచ్చింది. నిన్న ఈ రెండు దేశాల మధ్య తొలివిడత చర్చలు జరిగినా.. ఫలితం కనిపించలేదు. ఉక్రెయిన్ ఆయుధాలను వదిలేస్తేనే మేం యుద్ధం ఆపుతామని రష్యా భీష్మించుకుంది.. దానికి ఉక్రెయిన్ ఒప్పుకోలేదు. అలా చేస్తే.. మేం రష్యాకు పూర్తిగా లొంగిపోనట్టు అవుతుందని ఉక్రెయిన్ వాదించింది. మొత్తం మీద తొలివిడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే.. చర్చలు కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవడం కాస్తలో కాస్త ఊరట.
ఇప్పుడు రెండో విడత చర్చలకు ముహూర్తం కుదిరింది. రేపు రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. రష్యా దాడుల్లో పదుల సంఖ్యలో జనం కూడా మరణిస్తున్నారు. ప్రస్తుతానికి రష్యా ప్రజలే లక్ష్యంగా దాడులు చేయనప్పటికీ.. దాడులు జరిగిన ప్రాంతంలోని ప్రజలు అక్కడక్కడా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇండియా నుంచి వెళ్లిన నవీన్ అనేక కర్ణాటక విద్యార్థి కూడా ఇవాళ రష్యా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఇలాంటి చర్యల వల్ల రష్యాపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు.. అనేక దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు సత్ఫలితాలు ఇవ్వాలని ప్రపంచం అంతా కోరుకుంటోంది. ఈ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసిపోవాలని శాంతి కాముకులంతా కోరుకుంటున్నారు. చూడాలి రేపటి చర్చలు ఏమవుతాయో..?