ప్రకాశంలో ఆ టీడీపీ నేతకు పొగ పెడుతోందెవరు...!
ఇదే విషయం ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతనూతల పాడు నియోజకవర్గం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిం ది. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ విషయంలో నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తరఫున విజయ కుమార్ ఇక్కడ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయన ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, కనీసం.. పార్టీలో ఏం జరుగుతోంది.. పార్టీని ఎలా డెవలప్ చేయాలి.. అనే విషయాలను కూడా పట్టించుకోకుండా .. తన వ్యాపారాలు చేసుకుంటున్నారని.. టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నా రు.
అంతేకాదు.. విజయ్‌కుమార్ కొన్నాళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారా ల్లోనే ఉన్నారని.. ఫలితంగా ఇక్కడ నేతలను కానీ, పార్టీని కానీ.. పట్టించుకోవడం లేదని నేతలు వాపో తున్నారు. ఈ క్రమంలోనే తమకు నాయకుడిని మార్చాలని..వారు ఇటీవల చంద్రబాబుకు విన్నవించా రు. ఒక పెద్ద ఫిర్యాదుల చిట్టానే.. చంద్రబాబుకు అందించినట్టు తెలిసింది. పైగా విజయ్ కుమార్ 2014 ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ ఎమ్మె ల్యే గా ఉన్నారు. ఆ ఎన్నికలకు ముందే ఆయన టీడీపీ లోకి వచ్చారు.
ఆ ఎన్నికల్లో విజయ్ కుమార్ చాల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు కూడా ఆయన నియోజకవర్గంలో పార్టీ ని స్ట్రాంగ్ చేసుకోలేక పోయారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ మరింత నాశనం అయ్యేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఇక్కడ చర్చకు దారితీసింది. ప్రస్తుతం వైసీపీ ఇక్కడ జోష్‌లో ఉంది. కానీ, టీడీపీలో మాత్రం అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. విజయకుమార్‌ను మార్చాల్సిందేనని నాయకులు పట్టుబడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.