కేసీఆర్‌ను జగన్.. ఆ విషయంలో కాపీ కొడితే బెటర్..?
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేపట్టారు.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో శ్రద్ద తీసుకున్నారు.. రైతుల కోసం రైతు బంధు వంటి పథకం తీసుకొచ్చారు.. దళితుల కోసం దళిత బంధు పథకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే ఏపీలో జగన్ కూడా తనదైన పథకాలు రూపొందించారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారు. అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితి జగన్‌కు అంతగా సహకరించడం లేదు.
ఇక తెలంగాణలో కేసీఆర్ కొత్త జిల్లాల ప్రయోగం ఏడాది క్రితమే చేశారు.. ఇప్పుడు.. జగన్ కూడా అదే తరహాలోనే ఎంపీ నియోజక వర్గాల ఆధారంగా కొత్త జిల్లాలకు ప్రయత్నిస్తున్నారు. అయితే... కేసీఆర్ చేపట్టిన కొత్త జిల్లా ప్రయోగంపై మిశ్రమ స్పందన వచ్చింది. మరీ చిన్న జిల్లాలు చేశారని.. ఎమ్మెల్యే నియోజక వర్గాలను ఛిన్నాభిన్నం చేశారని.. దీని వల్ల ఒక ఎమ్మెల్యే అనేక జిల్లా పరిధిలోకి వస్తున్నారని.. దీనివల్ల సమన్వయం కుదరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అసలు కేసీఆర్ కొత్త జిల్లాల ప్రయోగం ఓ విఫల ప్రయోగం అంటున్న కొందరు టీడీపీ నేతలు.. దమ్ముంటే జగన్.. కేసీఆర్ నుంచి రైతు బంధు వంటి పథకాలు కాపీ కొట్టాలని సవాల్ విసురుతున్నారు.
రైతుల కోసం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు కాపీ కొడితే పర్వాలేదు కానీ.. ఇలాంటి ఫెయిల్యూర్ ఆలోచనలను తెలంగాణ నుంచి తీసుకోవద్దని సూచిస్తున్నారు.