వామ్మో ! : హీరోలు నిర్మాతలు అవ్వడం వల్లే కష్టాలు తెలిశాయా?
హీరో ప్రభాస్ (నటుడు మరియు నిర్మాత)
హీరో చిరంజీవి (నటుడు మరియు నిర్మాత)
ఒక్కసారి ఈ ఆర్డర్ చూడండి..అంతా కూడా ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి వచ్చిన వారే! మొదట్నుంచి ఉన్న అంజనా ప్రొడక్షన్స్ స్థానంలో రామ్ చరణ్ సారథ్యాన కొణెదల ప్రొడక్షన్స్ వచ్చింది.ఈ బ్యానర్లోనే చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మొదలుకుని ఆచార్య వరకూ ఇదే విధంగా రేపటి వేళ చిరు నటించే అన్ని సినిమాలూ తీయబోతున్నారు.వీటిలో కొన్నింటికి సహ నిర్మాతలుగా బయట వ్యక్తులు వ్యహరించనున్నారు కూడా! ఇక మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట బ్యానర్ ప్రారంభించారు.శ్రీమంతుడు సినిమా మొదలుకుని ఇప్పటి సర్కారు వారి పాట వరకూ సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ బయట వ్యక్తులను సహ నిర్మాతలుగా ఉంచారు.ఇదే విధంగా ప్రభాస్ కూడా తన పెదనాన్న బ్యానర్ గోపీ కృష్ణా మూవీస్ ఉంటుండగానే తన స్నేహితులతో యూవీ క్రియేషన్స్ ఆరంభించారు.వంశీ - ప్రమోద్ అనే ఇద్దరు ఈ సంస్థ వ్యవహారాలు చూస్తున్నారు. అదేవిధంగా థియేటర్ల వ్యాపారంలో కూడా వీరున్నారు.
మిర్చి సినిమా దగ్గరనుంచి వీళ్లిద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. దీంతో పాటు యూవీ క్రియేషన్స్ కు అనుంబంధంగానే చిన్న సినిమాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు.తనకు హీరోగా జీవితం ఇచ్చిన వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ తో ఇప్పటికే ఓ సినిమా తీశారు. ఇదే సమయంలో మరో సినిమాతో పాటు ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ కూడా చేయనున్నారు అని టాక్. త్వరలో వీరితో బన్నీ వాసు (గీతాఆర్ట్స్ 2), మారుతి (గుడ్ సినిమా) వీరిద్దరూ కలిసి కూడా సినిమాలు నిర్మించనున్నారు.ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ రాధే శ్యామ్ తరువాత మిగిలిన సినిమాలపై కూడా డబ్బులు పెట్టేందుకు యూవీ బ్యానర్ సిద్ధంగానే ఉంది.అంటే వీళ్లంతా నిర్మాణ రంగంలో వచ్చారు కనుకనే నిర్మాతల తరఫు గొంతుకూడా వీళ్లే వినిపించి గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఏకరువు పెట్టారు.అదే వీళ్లు నిర్మాతలుగా కాకపోతే ఇంతగా గొంతు చించుకుని అరిచేవారా చెప్పండి. ఏదయినా తన దాకా వస్తే గానీ తెలియదు బ్రదర్.