హోదాపై సాయిరెడ్డి పర్ఫామెన్స్...?

VUYYURU SUBHASH
ప్రత్యేక హోదా...ఈ పేరు విని ఏపీ ప్రజలు చాలా కాలం అయిపోయి ఉంటుంది..రాజకీయ నేతలు ఈ హోదా విషయాన్ని అడ్డం పెట్టుకుని వారు రాజకీయంగా బాగానే కాలం గడిపారు. కానీ ఏ నాయకుడు కూడా హోదాని సాధించలేదు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ గాని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గాని హోదా సాధించలేకపోయింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. గతంలో హోదా బదులు ప్యాకేజ్ ఇస్తామని కవర్ చేశారు..కానీ ఆ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు.

అబ్బే చంద్రబాబు హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని, తనకు 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చిస్తానని అన్నారు. జగన్ మాటలు నమ్మి ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలని ఇచ్చారు. దీంతో జగన్ ఏదో సాధించేస్తారని అంతా అనుకున్నారు. కానీ గెలిచిన వెంటనే కేంద్రం మెడలు వంచడం ఏమో గాని..ఈయనే కేంద్రం దగ్గర మెడలు వంచేసి ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా హోదాని పక్కదారి పట్టించేసింది...అసలు హోదా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. అయినా సరే హోదా విషయంలో ఏదో రాజకీయ డ్రామా నడిపించాలనే కోణంలో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి హోదా గురించి అడగకపోతే ప్రజల్లో నెగిటివ్ అయిపోతామని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే మొక్కుబడిగా పార్లమెంట్‌లో హోదా గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు.

తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హోదా అంశాన్ని లేవనెత్తారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వైఖరి సరికాదని, కుంటిసాకులు చెప్తూ కేంద్రం కాలయాపన చేస్తోందని, వైసీపీ అధికారంలో ఉండడానికి ప్రత్యేక హోదానే కారణమని, ప్రత్యేక హోదా సాధన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి రాజ్యసభలో నాలుగు డైలాగులు హోదా గురించి మాట్లాడారు. ఇలా మాట్లాడటం వల్ల..ఏదో హోదా గురించి మాట్లాడమని ప్రజలకు కనిపిస్తారు. అంతే తప్ప హోదాపై పోరాటాలు మాత్రం చేయరు..ఇదంతా ఒక డ్రామా మాదిరిగానే ఉందని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: