జగన్ : ఎంతైనా ఆడు మగాడ్రా బుజ్జీ..?
గతంలో చంద్రబాబు వంటి ముఖ్యమంత్రులు ఉద్యోగులతో పేచీ పెట్టుకోవడం వల్లే.. ఆయన ఆనాటి పరాజయానికి ఉద్యోగులు కారణం అయ్యారన్న వాదనలు కూడా ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు తీరుతో విసుగెత్తిపోయిన ఉద్యోగులు.. పోలింగ్ బూత్‌లతో జనంతో విపక్షాలకు ఓట్లు వేయించారన్న ప్రచారం కూడా జరిగింది. పైగా ఉద్యోగులు ఓ సంఘటిత శక్తి.. లక్షల సంఖ్యలో ఉండే సమూహం.. వారు.. వారి కుటుంబాలు.. వారితో సంబంధం ఉన్నవారు..మొత్త కలుపుకుంటే లక్షల్లో ఉంటారు. వారు కూడా ఓటర్లే. అందుకే సహజంగా ఎవరూ ఉద్యోగులతో పెట్టుకోరు.
కానీ.. సీఎం జగన్ మాత్రం.. ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. సీఎం జగన్ వద్ద ఖజానా నిండుగా ఏమీ లేదు..అసలే కరోనా కాలం ఆదాయం తగ్గింది. మరి ఈ ఆదాయంతో సంక్షేమ పథకాలు నడిపించాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి.. అందుకే ఉద్యోగులకు అంతంత ఫిట్‌మెంట్లు ఇవ్వలేనని ముఖం మీదే చెప్పేస్తున్నారు. అంతే కాదు.. చరిత్రలోనే మొదటి సారిగా ఫిట్‌మెంట్‌ను మధ్యంతర భృతి కంటే తక్కువగా ప్రకటించారు.
ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి.. చివరకు ఉద్యోగులు.. మా పాత జీతాలు మాకు ఇవ్వండి మహా ప్రభో అంటున్నారు. ఇది చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం. అయితే ఉద్యోగులు కూడా సమాజంలో భాగమే. సమాజానికి అతీతులు కాదు. మరి జగన్ వారితో ఘర్షణ పడటం వల్ల ముందు ముందు ఇబ్బందులు పడతారా.. లేక.. దాని ద్వారా కూడా రాజకీయ లబ్ది పొందుతారా.. చూడాలి. ఏంజరుగుతుందో..?