పుకారు: సజ్జనార్‌ స్టైల్లో ఆ కాలకేయుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా..?

వనమా రాఘవ.. ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు.. ఓ ఎమ్మెల్యే కొడుకుగా పెత్తనం చెలాయిస్తూ.. ఏళ్ల తరబడి రాజ్యాంగేతర శక్తిగా అరాచకం చేస్తున్న ఓ ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ.. ఈ కామపిశాచి కాలకేయుడిగా మారి.. ఓ నిండు కుటుంబం ఆత్మహత్యకు కారమైన సంగతి తెలిసిందే.  కుటుంబ సమస్యను పెద్ద మనిషిగా తీరుస్తాడని వెళ్తే.. చివరకు బాధితుడి భార్యను పంపిస్తే తప్ప వ్యవహారం సెటిల్ చేయనని.. తేల్చి చెప్పడమే కాదు.. నీకు నీ భార్యను నా దగ్గరకు పంపడం తప్ప వేరే మార్గం లేదని ఖరాఖండీగా చెప్పిన కాలకేయ సంతతికి చెందిన వాడు ఈ వనమా రాఘవేంద్ర.

అయితే.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకైన వనమా రాఘవేంద్రపై ఈ సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ పెద్ద సెల్ఫీ వీడియోలో బయటపెట్టిన వనమా రాఘవేంద్ర నిజస్వరూపం తెలిసినప్పటి నుంచి జనం గుండెలు మండుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ ఈ వనమా రాఘవేంద్రను పోలీసులు పట్టుకున్నామని ప్రకటించడం లేదు. మరోవైపు.. స్వయంగా ఎమ్మెల్యే వనమానే.. నేనే నా కొడుకును పట్టిస్తానని చెప్పినా ఇప్పటి వరకూ అధికారికంగా వనమాను అరెస్టు చూపించడం లేదు.

మరి వనమా రాఘవేంద్ర ఎక్కడ ఉన్నట్టు.. నిన్ననే వనమా రాఘవేంద్రను అరెస్టు చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ నిన్న రాత్రికే సీన్ మారిపోయింది.. అబ్బే వనమా రాఘవేంద్ర మాకు చిక్కలేదు.. ఇంకా గాలిస్తున్నాం.. మొత్తం 8 బృందాలు అతని కోసం తెలుగు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వనమా రాఘవేంద్ర పోలీసుల అదుపులోనే ఉన్నాడని మీడియా ఘోషిస్తోంది.

అయితే.. ఈ దాపరికం ఎందుకు.. వనమా రాఘవేంద్ర ఇష్యూతో వచ్చిన చెడ్డ పేరును పోగొట్టుకునేందుకు ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ ఆలోచన చేస్తున్నారా.. అన్న ఊహాగానాలు, పుకార్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే కొడుకు విషయంలో అలా చేస్తారా అన్న అనుమానం ఉన్నా.. మరి ఇంత దాపరికం ఎందుకన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: