ఎందుకలాగ?: విష్ణు మౌనం.. రెచ్చిపోయిన మోహన్‌బాబు..?


తెలుగు సినీ పరిశ్రమ చిక్కుల్లో ఉంది. ప్రస్తుతం పరిశ్రమలో సినిమా థియేటర్ల వివాదం.. టిక్కెట్ల వివాదం.. ప్రీమియర్ షోల వివాదం.. ఇలా అనేక వివాదాలు ఉన్నాయి. అయితే.. కొన్ని రోజుల క్రితమే మా ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు.. ఎన్నికల రోజు... ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలోనూ మీడియాలో ఈ వార్తలు బాగా కవర్ అయ్యాయి. అవేవో దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు అన్నంత రేంజ్‌లో పబ్లిసిటీ వచ్చింది.

చివరకు ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలిచింది. అయితే.. అక్రమంగా గెలిచారన్న ఆరోపణలతో పాటు.. తమ మాటనెగ్గదన్న కారణంతో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లు కూడా రాజీనామాలు చేశారు. ఆ తర్వాత సినీపరిశ్రమ కోసం తాము పాటుపడతామని కొత్త మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. కొన్నిరోజులుగా సినీ పరిశ్రమలో టికెట్ల వివాదం, థియేటర్ల వివాదంపై నానా రచ్చ జరుగుతుంటే.. మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం సైలంట్‌గానే ఉండిపోయారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపినట్టు కనిపించడం లేదు.

ఇదే సమయంలో తాజా  ఆయన తండ్రి మంచు మోహన్ బాబు మాత్రం ఓ బహిరంగ లేఖ రాశారు. చిత్ర పరిశ్రమలోనూ వారంతా ఒక్కటై  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని సూచించారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదు అంటూ మోహన్ బాబు తన లేఖలో కామెంట్‌ చేశారు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే ఈ కష్టాలు వచ్చుండేవి కావని అన్నారు. ఇంకా అనేక వ్యాఖ్యలు చేశారు. మరి అసలు మా అధ్యక్షుడు మంచు విష్ణు మౌనంగా ఉంటే.. మోహన్ బాబు ఈ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏంటన్న గుసగుసలు ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: