జగన్‌ సృష్టి: హ్యూమన్‌ క్యాపిటల్‌.. హ్యూమన్ ఎసెట్స్..?

ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ది జరిగింది.. ఇదీ తరచూ విపక్షాలు అడిగే ప్రశ్న.. ఒక్క పరిశ్రమ అయినా అదనంగా వచ్చిందా.. ఒక్క కంపెనీనైనా తీసుకురాగలిగారా.. విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించారా.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారా.. కొత్తగా ఒక్క పరిశ్రమ అయినా ఏపీకి రప్పించారా.. అంటూ విపక్షాలు ఇప్పటికే నిలదీస్తున్నాయి. అయితే మరి జగన్ పరిపాలనలో ఏం జరిగింది.. జగన్ ఏం చేస్తున్నారు.. ఈ ప్రశ్నలకు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం ఇస్తున్నారు.

ఏపీ సీఎం జగన్ సంక్షేమంతో పాటు పారదర్శకతతో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని సజ్జల అంటున్నారు. జగన్ క్రియేటింగ్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌, ఎసెట్స్.. అంటున్నారు సజ్జల. ఏపీలోని  అయిదుకోట్ల మందిలో యువత ఎంతమంది తయారు అవుతారో వారంతా  హైలీ ఎడ్యుకేటెడ్‌ స్కిల్స్‌తో బయటకు రాబోతున్నారట. ఇందుకు జగన్ సర్కారు కొన్నేళ్లుగా అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమం పునాదిగా నిలుస్తుందట.

ఈ నాడు నేడు ద్వారా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్బీకేలు సామాజిక ఆస్తులు అంటున్నారు సజ్జల. ఈ స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్బీకేల నుంచి వచ్చేవి కొత్త ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు, పునరుజ్జీవనం ఇస్తాయని సజ్జల చెబుతున్నారు. జగన్.. దీర్ఘకాలికంగా సుసంపన్నమైన, ఆరోగ్యదాయకమైన, విద్యాదాయమైన ఏపీని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల అంటున్నారు.

జగన్ ప్రభుత్వం తన, మన, పర, భేదం చూడకుండా చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసిందని సజ్జల అంటున్నారు. దాన్ని ఉపయోగించుకునేందుకు అందరూ చొరవ చూపించాలని.. జగన్ బంగారుబాటలు వేస్తున్నారని దాన్ని కూడా తప్పుబడితే ఎలా అని సజ్జల ప్రశ్నిస్తున్నారు. అవును నిజమే కావచ్చు.. జగన్ నాడు నేడు ద్వారా విద్యారంగంలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇవి సత్ఫలితాలు ఇస్తే.. ఓ తరం తరమే మారిపోయే అవకాశం ఉంది. అంటే జగన్.. హ్యూమన్‌ క్యాపిటల్‌.. హ్యూమన్ ఎసెట్స్ ను సృష్టిస్తున్నారన్నమాట..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: