శభాష్‌ మోదీ: ఆఫ్ఘనిస్తాన్‌కు ఇండియా సాయం..?

బతుకు బతకనివ్వు.. ఇదీ ఇండియా విధానం.. మన సంస్కృతి మనకు నేర్పింది అదే.. పొరుగువాడితో స్నేహంగా ఉండటం.. ఆపదలో ఆదుకోవడం మన సంస్కృతి ఇచ్చిన వారసత్వ విలువగా చూడాలి. ఇప్పుడు కరోనా కష్టకాలంలోనూ ఇండియా అదే స్ఫూర్తి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తాలిబన్ల చెరలో చిక్కిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఇప్పుడు ఇండియా సాయం చేస్తోంది. కరోనాపై పోరాటంలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇండియా అండగా నిలుస్తోంది.

మానవతా సాయం కింద కరోనా టీకాలు ఆఫ్ఘనిస్తాన్‌ కు ఇండియా సరఫలా చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు ఇండియా ఇప్పటికే వైద్యపరికరాల సరఫరా సహా అనేక రూపాల్లో సాయం చేసింది. ఇక ఇప్పుడు  భారత్ 5 లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఉన్న ఇందిరా గాంధీ ఆసుపత్రికి ఇండియా ఈ కొవాగ్జిన్ టీకాలు అందజేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టీకాలే కాదు.. రాబోయే రోజుల్లో మరో 5లక్షల టీకాలు పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చింది.

టీకాలే కాదు.. మానవతాసాయం కింద ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌ కు ఆహారధాన్యాలు, ఔషధాలు కూడా అందిస్తోంది.  50వేల టన్నుల గోధుమలతో పాటు అనేక ఔషధాలను రోడ్డు మార్గంలో పాకిస్తాన్‌ గుండా ఆఫ్ఘనిస్తాన్‌ కు భారత్ పంపబోతోంది. ఈ సాయం అందించేందుకు పాకిస్తాన్ తో ఇండియా సంప్రదింపులు జరుపుతోంది.

గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాప్రభుత్వం ఉన్నప్పడు మన దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు చాలా సన్నిహిత దేశంగా ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌కు పార్లమెంట్ భవనం కూడా ఇండియానే కట్టించింది. అంతే కాదు.. కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆసుపత్రిని కూడా ఇండియాయే కట్టించింది. ఇలా ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కు అనేక విధాలుగా సాయం చేసింది. అయితే ఇప్పుడు ఉన్న తాలిబన్లు ఇండియాకు అనుకూలమూ కాదు.. అలాగని వ్యతిరేకమూ కాదు. మనకు అనుకూలం అయినా కాకపోయినా మానవతా సాయం కింది ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌కు టీకాలు పంపిణీ చేస్తోంది. శభాష్ ఇండియా..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: