విద్యత్ పై ఎవరి వాదన వారిదే


భారత్ ను పీడిస్తున్న ప్రధాన సమస్య విద్యుత్ కొరత. ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలు పరస్పర విరుద్దంగా స్పందిస్తున్నాయి. సమస్యకు మూలకారణం మీరే అని ఒకరు అంటే .. కాదు మీరే కారణం అని మరోకరు అంటున్నారు.  దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో  రెండు తెలుగు రాష్ట్రాలూ పాల్గోన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ వాదనను  సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వినిపించారు. తెలంగాణ వాదనను ఆ రాష్ట్ర గవర్నర్,  ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ ప్రస్తావించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి చొరప చూపాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. నాడు కేంద్రంలో ఉన్న పాలకులు ఒత్తిడి చేయడం వల్లనే  ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థ జన్ కో నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా  చేసిందని తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి తమకు విద్యుత్ పంపిణీ బకాయీలు రూ. 6,112 కోట్లు రావలసి ఉందని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసమంజసమైన వాదనలు వినిపిస్తున్నదని, ఈ విషయంలో  కేంద్ర  ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.   బకాయిలు చెల్లించ కుంటే తాము విద్యుత్ సరఫరా చేయలేమని ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థ జెన్ కో  తెలంగాణ ప్రభుత్వానికి గతంలోనే స్పష్టం చేసిందని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ దశలో కేంద్ర విద్యుత్ శక్తి మండలి జోక్యం చేసుకుని విద్యుత్ ను సరఫరా చేయాలని అదేశించిందని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ జన్ కో  సంస్థ విద్యుత్ ను తెలంగాణకు సరఫరా చేసిందని, ఇంతవరకూ బకాయిలు చెల్లంచ లేదని  తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదేశాను సారం తమ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకున్నదని, బకాయిలు అందజేసే బాధ్యతను కూడా  కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు అధ్యక్షత వహించన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు.
ఇదే సమావేశానికి హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళఇసై  , ఆ రాష్ట్ర హోం మంత్రి మసూద్ ఆలీ తమ   తమ వాదనను వినిపించారు. మసూద్ ఆలీ మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ వాదనలో అర్థం లేదని స్పష్టంగా తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే  తెలంగాణకు  విద్యుత్ బకాయిల క్రింద 4, 457  కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీరు ఏకపక్షంగా ఉందని విమర్శించారు. విభజన సమస్యలు, తెలంగాణ రాష్ట్రం చేస్తున్న విజ్ఞప్తులను ఏవీ  కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సభకు వివరించారు.  అంతే కాకుండా నేషనల్ కంపెనీ లాట్రిబ్యూనల్ ను ఆశ్రయించారని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అంతే  కాకుండా తెలంగాణ హై కోర్టులోనూ మరో పిటీషన్ దాఖలు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. కోర్టు సైతం ఈ సమస్యను ద్వైపాక్షికంగా చర్చించు కోవాలని సూచించినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ఎంత వరకూ సబబని  తెలంగాణ ప్రభుత్వం  ప్రశ్నించింది.
ఈ అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలూ పరస్పరం చర్చించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయం పై కేంద్ర వైఖరి ఏమిటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: