కేసీఆర్‌ Vs ఈటల: దళిత పద్మవ్యూహం పన్నిన రేవంత్..?

దళిత బంధు.. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బాగా వినిపించిన పథకం పేరు.. దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి.. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం.. దళితులను వ్యాపార వేత్తలుగా మార్చడం ఈ దళిత బంధు పథకం ఉద్దేశంగా చెబుతున్నారు కేసీఆర్. కానీ.. అసలు హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ఈ దళిత బంధు పథకం తెచ్చారన్న వాదనలు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ.. కేసీఆర్ దీన్ని ఖండించాడు. ఇది సుదీర్ఘ కాలం సాగే పథకం అని.. వచ్చే పదేళ్లలో ఈ పథకాన్ని తెలంగాణ అంతటా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే.. ఇందిరా గాంధీ కాలం నుంచి దళితులు ఎక్కువగా కాంగ్రెస్‌తోనే ఉన్నారన్న అంచనా ఉంది. అలాంటి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును దగ్గర చేసుకోవాలన్నదే కేసీఆర్ ప్రయత్నం. అది హుజూరాబాద్ కోసమా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసమా అన్నది అప్రస్తుతం.. మొత్తానికి దళితులను ఆకట్టుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. తన పార్టీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌కు మరల కూడదంటే.. దళిత బంధు పథకం ఇచ్చినా దళితులు టీఆర్‌ఎస్‌ వెనుక నిలవరని నిరూపించాలి.

అందుకే రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికనే ఆయుధంగా మలచుకున్నాడు. హూజూరాబాద్‌ ఎన్నిక కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే.. అందుకే ఈ ఉప ఎన్నికలో ఓడినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్.. హుజూరాబాద్‌లో దళిత బంధు వర్కవుట్ అయ్యి.. టీఆర్ఎస్ గెలిస్తే.. కేసీఆర్ దాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా అమలు చేస్తారు.. అందుకే ముందు దళిత బంధు ఇచ్చినా కేసీఆర్‌కు ఉపయోగం ఉండదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి.. అందుకు టీఆర్ఎస్‌ను తప్పనిసరిగా హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడించాలి.. ఇదీ రేవంత్ ఆలోచన.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓడినా పరవాలేదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బంధు ఆధారంగా టీఆర్ఎస్‌ విజృంభించకుండా చూడాలి. అదే లక్ష్యంతో రేవంత్ రెడ్డి హుజూరాబాద్‌లో పరోక్షంగా బీజేపీకి సహకరించారనే చెప్పాలి. అలా రేవంత్ పన్నిన దళిత పద్మవ్యూహంలో కేసీఆర్‌ చిక్కుకున్నాడంటున్నారు కొందరు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: