డిజిటల్ మీడియాలో దూసుకుపోతున్న దిశ..?

ఇప్పుడు మీడియా స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు మీడియా అంటే ముందు వినిపించే పేరు దిన పత్రిక.. దిన పత్రికలో వస్తేనే వార్త.. పేపర్లో వస్తేనే ఆ వార్తకు ప్రామాణికత. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రాకతో కాస్త దిన పత్రికల జోరు తగ్గింది. అయితే.. వార్తల ప్రామాణిత కోసం మళ్లీ డెయిలీ పేపర్ చూడాల్సిన అవసరం వచ్చేది. అలా పేపర్.. టీవీ ఛానళ్లు వచ్చాక కూడా కొన్నాళ్లు ఆధిపత్యం కనపరిచింది. అంతే కాదు.. రాజకీయ నాయకులు, స్థానిక నేతలకు పేపర్లో తమ వార్త పడితేనో అదో సంతృప్తి.

అలాంటి ప్రింట్ మీడియాను కరోనా చావు దెబ్బ కొట్టిందనే చెప్పాలి.. కరోనా వేళ పత్రిక సర్క్యులేషన్లు దారుణంగా పడిపోయాయి. అంతే కాదు.. ఆదాయాలు బాగా పడిపోయి పత్రికలు సైతం తమ ముద్రణ తగ్గించుకున్నాయి. తెలుగులో ఈనాడు వంటి టాప్ పేపర్ కూడా తన పేజీలు గణనీయంగా తగ్గించుకుంది. ఇక కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రింట్ జర్నలిస్టులు ఎందరో. మరికొందరికి జీతాల్లో కోత.. ఇలా కరోనా ప్రింట్ మీడియాను బాగానే దెబ్బ తీసింది.

అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రింట్‌కు మరో ప్రత్యామ్నాయంగా మారింది. ఇందుకు తాజాగా ఉదాహరణగా  దిశ డెయిలీ నిలుస్తోంది. కేవలం డిజిటల్ ఎడిషన్‌గా వస్తున్న దిశ డెయిలీ.. తక్కువ కాలంలోనే డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది. తెలుగు అన్ని ప్రధాన పత్రికలకూ ఈ పేపర్‌లు ఉన్నాయి. ఈ పేపర్‌గా, వెబ్‌సైట్‌లో మాత్రమే వస్తున్న దిశ డెయిలీ రోజురోజుకూ తన ఆదరణ పెంచుకుంటోంది. అతి తక్కువ కాలంలోనే ఇది అలెక్సా రేటింగ్‌లో దూసుకుపోతోంది.

తెలుగులో ఈనాడు  125 ఇండియన్‌ అలెక్సా ర్యాంక్‌ లో ఉంటే.. ఆ తర్వాత స్థానంలో సాక్షి 182 వ ర్యాంక్‌లో ఉంది. దిశ ఇప్పుడు మూడో స్థానానికి ఎగబాకింది. ప్రింట్ ఎడిషన్లున్న ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, వెలుగును దాటేసి దిశ డెయిలీ ముందుకు వెళ్తోంది. డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణకు దిశ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: