నివాళి : చిన్నారి చైత్ర‌కు మ‌న్నింపు అడ‌గ‌లేను?

RATNA KISHORE
ఇంటి దీపాల‌ను ఇంటికి చేర్చాలి. ఇంటి దీపాల‌ను గూటికి చేర్చాలి. ఇంటి దీపాలే ఇవి ఆకాశంలో మెరిసి న‌వ్వుతుంటే ఏం చేయా లి. ప్రార్థించి ఆ చిన్నారుల‌కు నివాళి చెల్లించి రావ‌డం త‌ప్ప ఏం చేయ‌గ‌లం. మీరు రంగులు పులిమి ఈ సందేశాన్ని మోసుకుపోకం డి. ప్లీజ్! ఇవి ఎలా ఉన్నా జీవితం మారదు. జీవితంలో స్మ‌శాన ద‌శ ఒక‌టి త‌ప్ప‌క ఉంటుంది అది త్వ‌ర‌గా ప‌రిచ‌యం కావ‌డం మా న‌దు. నిర్వాణ ద‌శ అని రాయాలి. ఆ ద‌శ‌ను దాట‌టం మాకు చేత‌గాదు. బుజ్జిత‌ల్లీ!  నువ్వెక్క‌డ‌? ప్రాణ స‌మాన చ‌ర్య‌లు కొన్ని త‌ప్ప‌క చేప‌ట్టాలి. ప్రాణాలు కాపాడాలి. అయిన వారిని కాపాడుకోవాలి. ఏదేమ‌యినా దేవుడు ఇచ్చాడు. దేవుడే తీసుకుని ఒక శాపం వెన్నంటే ఉంచి పోయాడు ఆ త‌ల్లిదండ్రుల‌కు. బిడ్డ‌ల‌ను దేవుడు ఇచ్చి, మ‌ళ్లీ తీసుకోవ‌డంలో అంత తొంద‌రేంటి అని అడ‌గ‌కండి. అన్నీ విష తుల్య కాలాలే! ఎవ్వ‌రినో నిందించి రాజకీయం చేయొద్దు..త‌ల్లీ తండ్రీ మోస్తున్న శోకాన్ని పెంచ‌కండి.

పిల్ల‌లంతా ఏమ‌యిపోతున్నారు. బాల్యం, య‌వ్వ‌నం ఈ రెంటి మ‌ధ్య తేడా ఏంటో తెలియ‌ని వ‌య‌స్సులోనే పిల్లలు ఏమ‌యిపోతు న్నారు. మ‌ట్టి తో ఆడే పిల్ల‌లు లేరిప్పుడు. నాన్న‌తో ఆడే పిల్ల‌లు బొమ్మ‌లు లేవిప్పుడు.  అమ్మ‌కు నాలుగు మాటలు చెప్పే బిడ్డలు లేరిప్పుడు. కొంద‌రి దాహం కార‌ణంగా వారు వాన‌ల్లో కొట్టుకుపోతున్నారు. క‌న్నీటి వాన‌ల్లో కొట్టుకుపోతున్నారు.
దయ‌నీయ‌మ యిన మ‌నుషులు ఎవ్వ‌రూ లేరిక్క‌డ. న‌ట‌న నేర్చిన మ‌నుషులే ఇక్క‌డ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడెవ‌ర‌యినా అటు వెళ్ల‌కండి స‌ర్..ప్లీజ్ ! రాజ్యంలో మీరూ, మేమూ ఎప్పుడూ స‌మానం కాలేము. మా పిల్ల‌ల ప్రాణాలు మీ పిల్లల ప్రాణాల‌తో స మానం కావు. మా ఆడ‌బిడ్డ‌ల దేహాలు మీ ఆడ‌బిడ్డ‌ల దేహాలు ఎన్న‌డూ స‌ర్వం స‌మానంగా ర‌క్ష‌ణ‌కు, భ‌ద్ర‌త‌కు నోచుకోవు. పండుగ రోజు భ‌గ‌వంతుడు ప‌సి పిల్ల‌ల‌ను ఎందుకు దూరం చేశాడో తెల్సుకోలేం. ఇదంతా విధి అని త‌ప్పుకోలేం. బాధ‌ను అంగీక‌రించ‌లేం.


ప‌సిపాప ప్రాణం తీసిన సంద‌ర్భాల‌ను పొలిటిక‌ల్ రంగులు ఎందుకు వాడుకుంటున్నాయి అని అడ‌గ‌కండి. ఇప్పుడు అడిగినా, అడ గకున్నా వీరు మారరు. ఇవి దొంగ దీక్ష‌ల కాలం. కాలం చెల్లిన వాటిని మ‌నం ద‌గ్గ‌ర‌కు తీసుకోకూడ‌దు. కాలాన్ని కొనుగోలు చేసి త మ గుప్పిట ఉంచిన వారిని మ‌నం అస్స‌లు ద‌రి చేర‌నివ్వ కూడ‌దు. ఖ‌రీద‌యిన మ‌నుషులు రోడ్డెక్కి విల‌పిస్తుంటే భయంగా ఉంది.

 
భూమ్మీద న‌డిచే హ‌క్కు, మాట్లాడే హ‌క్కు వీరికే ఉంద‌న్న భ‌యం నాలో ఉంది. మీలోనూ ఉండాలి. వారి స్థితి ఎలా ఉన్నా, వారి ని నాదం ఏమై ఉన్నా ప్రాణాలు పోయిన బిడ్డ‌లంతా ఒక్క‌చోట చేరి దేశం బాగు కోసం ఎదురు చూస్తున్నారు. ఆత్మ‌ను ప‌రీక్షించి ఒక్క సారి అయినా దేహాన్ని శుభ్రం చేసుకోమ‌ని మాలిన్యమ‌యం అయిన రాజ‌కీయ నాయ‌కుల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. కాస్త‌యినా వారి గోడు వినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: