వై వైవీ ? : ద‌ళిత గోవిందం ఏమయిందో? మ‌రిచిపోయారు స‌ర్ !

RATNA KISHORE
దేవుడి ద‌గ్గ‌ర దేవ దేవుడి ద‌గ్గ‌ర స‌మాన‌త్వం అన్న మాట‌కు తావే లేదు. పాపం కొంద‌రు సేవ‌కు అని వ‌స్తారు. వారిని కూడా ఎక్కు వ, త‌క్కువ‌లు చేసే చూస్తారు. అయినా వారంతా స్వామి కోసం వ‌చ్చామ‌న్న తృప్తితో కాలం  నెట్టుకు వ‌చ్చి, అధికారుల వేధింపు లు కానీ లేదా వారు పెట్టే ఇబ్బందులు కానీ భ‌రిస్తారు. ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన ఓ గొప్ప ప‌విత్ర ధామంలో మ‌నం ఆశించ‌డం త‌ప్పే కానీ జ‌రిగేది ఇదే! అంతెందుకు వెంగ‌మాంబ గొప్ప‌త‌నం కీర్తించే చోట మ‌హిళ‌ల‌కు ఏ పాటి గౌర‌వం ద‌క్కుతుందో కూడా చెప్తాను. ఇంత‌టి ద‌య‌నీయ స్థితిలో టీటీడీలో చాలా విభాగాలు సంబంధిత అధికారాలు చెలామ‌ణీ అవుతుంటే నేనో లేదా మీరో ద‌ళిత గో విందం లాంటి సంస్క‌ర‌ణాయుత కార్య‌క్ర‌మాలు ఆశించ‌డం త‌ప్పు అవుతుంది. ఆ త‌ప్పు నేను చేయ‌ను మీరూ చేయ‌కండి. వైవీ స‌ర్ వ‌చ్చే హుండీ ఆదాయాన్ని మాత్ర‌మే మీరు ప‌రిగ‌ణించండి..మీపై వ‌చ్చే లేదా మీ సంస్థ‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకండి ప్లీజ్ !


స‌మాన‌త్వం అన్న‌ది అన్న‌మ‌య్య బోధించాడు
కానీ స‌మాన‌త్వం అన్న‌ది జ‌వ‌హ‌ర్ తీసుకురాలేరు
ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్ కు అది సాధ్యం కాని ప‌ని
అంతెందుకు మాజీ న‌క్స‌లైట్ ఇప్ప‌టి ఎమ్మెల్యే భూమ‌న‌కు
కూడా ఇలాంటి బృహ‌త్త‌ర ఆశ‌యాల సాధ‌న అన్న‌ది
కుద‌ర‌ని ప‌ని..రాజ‌కీయం వేరు సిద్ధాంతం వేరు అని
చాలా మంది అంటుంటారు నాతో అదే నిజం.. నూరు పైస‌ల నిజం


రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ద‌ళిత గోవిందం అనే గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం దిద్దారు అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్, ఇప్ప‌టి తిరుప‌తి ఎ మ్మెల్యే భూమ‌న క‌రుణా క‌ర్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మం ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయింది. అదేవిధంగా కొన్ని విమ‌ర్శ‌ల కూ కార‌ణం అయింది. వాస్త‌వానికి చాలా కాలంగా టీటీడీ జేఈఓ (సారీ టీటీడీ పుట్ట‌క నుంచి) జేఈఓ (ప‌రిపాల‌న) విభాగం త‌ప్ప‌క జేఈఓ (టీటీడీ ఆల‌య నిర్వ‌హ‌ణ‌) అన్న‌ది ద‌ళితుల‌కు కేటాయించ‌ని అధికారం అని వామ‌ప‌క్ష నేత ఒక‌రు ఆ మ‌ధ్య ప్ర‌జాశ‌క్తిలో వ్యాసం రా శారు. ఆ విధంగా అప్ప‌ట్లో ఈ ద‌ళిత గోవిందం చ‌ర్చ‌కు తావిచ్చింది. అదే వ్యాసంలో ఆయ‌న ఈఓ జ‌వ‌హ‌ర్ నియామ‌కం కూడా కుల కోణంలోనే చూస్తూ కొన్ని విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఏదేమైన‌ప్ప‌టికీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణ‌యం ఒక వి ధంగా ఆచ‌ర‌ణీ య‌మే. కానీ ఇప్పుడు టీటీడీ ఇలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌గ‌ల‌దా అన్న‌దే ప్ర‌ధాన అనుమానం. ఒక‌వేళ ఇ లాంటి సంచ‌ల‌నా ల‌కు జ‌గ‌న్ ఆరంభం అయితే ఎటువంటి వివాదాలూ లేకుండా కార్య‌క్ర‌మాల‌ను న‌డ‌ప‌గ‌ల‌రా అన్న‌ది కూడా సందేహ‌మే. ఇప్ప‌టికే కొండపైన అన్య‌మ‌త ప్ర‌చారం పై అనేక వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి.

 
అదేవిధంగా టీటీడీ స్థ‌ల ప‌విత్ర‌త‌ను భంగం చేసే ప‌నులు కొన్ని జ‌రుగుతున్నాయ‌నీ తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకొన్ని ఆరోప‌ణ లు నిరూప‌ణ‌లో లేకుండా ఉన్నా యి. ఆదాయం లేని సాకుతో సారీ లేద‌న్న సాకుతో జ‌వ‌హ‌ర్ కొన్ని అబ‌ద్ధాలు చెప్పినా, వైవీ కొ న్ని అబ‌ద్ధాలు చెప్పినా టీటీడీ ఉద్యో గుల జీతాల పెంపు లేక‌పోవ‌డం విచార‌క‌రం. తెల్లారితే ఎన్నో క‌బుర్లు చెప్పే టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల‌కు న్యాయం చేయ‌డం లేద న్న సంగ‌తి వాస్త‌వ‌మే. ఈ ద‌శ‌లో పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లు, ద‌ళిత గోవిందం లాంటి ప‌నులు సారీ బృహ‌త్త‌ర ప‌నులు టీటీడీ నుంచి ఆశించ‌డంలో అతి ఉందేమో! కానీ ఓ మార్పును కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: