రామాలయాన్ని కూడా మోడీ వాడేస్తున్నారా.. ఆ ముహూర్తం అందుకేనా..?

అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రెండు, మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తయి రామాలయం భక్తుల దర్శనానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే.. అయోధ్య రామాలయం ప్రాజెక్టు చిన్నదేమీ కాదు. రామాలయంతోపాటు దాని చుట్టుపక్కల ఓ మ్యూజియం.. ఇతర సౌకర్యాలకు సంబంధించిన కట్టడాలు కూడా ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే మరో మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. అయితే.. తాజాగా 2023 డిసెంబర్ నాటికి రామాలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయన్న ప్రకటన వచ్చింది.


దేశమంతా హిందువులు కలలు కన్న రామాలయం ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుని.. భక్తులకు అందుబాటులోకి వస్తోందంటే ఆనందమే.. అయితే ఇదే సమయంలో రామాలయం ప్రాజెక్టు పూర్తిగా సిద్ధం కాకుండా.. మిగిలిన నిర్మాణాలు ఇంకా కొనసాగుతుండగానే ప్రధానాలయంలో దర్శనాలకు 2023 డిసెంబర్ నుంచి సిద్ధం చేయాలన్న నిర్ణయం వెనక సైతం రాజకీయాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఎందుకంటే..  2023 డిసెంబర్ అంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కచ్చితంగా ఆరు నెలలు ముందు అన్నమాట.. కావాలనే మోడీ సర్కారు ఈ రామాలయ ప్రారంభం అంశాన్ని వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం వాడుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు.. ఎందుకంటే మోడీ సర్కారుకు ఇప్పుడు అచ్చేదిన్‌ కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో చెప్పుకునేందుకు కొత్త ఘనతలేమీ కనిపించడం లేదు. దీనికి తోడు ఈ కరోనా దెబ్బతో అంతా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ను మోడీ సర్కారు సరిగ్గా కంట్రోల్ చేయలేదన్న విమర్శలూ ఉన్నాయి.


ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఇమేజ్‌తోనే మోడీ ఎన్నికలకు వెళ్తే భంగపాటు ఖాయం అన్న విషయం బీజేపీ పెద్దలకు దాదాపు అర్థమైపోయింది. అందుకే సరిగ్గా ఈ ఎన్నికల ముందు రామాలయ దర్శనం ప్రారంభించడం ద్వారా కొంతలో కొంత రాజకీయ లబ్ది చేకూరవచ్చని మోడీ ప్లాన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: