జపాన్‌కు షాక్ ఇస్తున్న ఒలింపిక్స్ టీఆర్పీ లెక్కలు..?
సాధారణంగా ఏ ఏటికాయేడాది వ్యూయర్షిప్ పెరగాలి.. ఇప్పుడు కరోనా కారణంగా జనం ఆన్లైన్లోనే ఒలింపిక్స్ చూస్తున్నారు.. గత నాలుగేళ్లలో ప్రపంచ జనాభా పెరిగింది.. గతంలో పోలిస్తే.. ఇంటర్ నెట్ స్ట్రీమింగ్ పెరిగింది. ప్రత్యామ్నాయ మార్గాలు పెరిగాయి. ఈ అంచనాల ప్రకారం వ్యూయర్ షిప్ పెరగాలి. కానీ పెరగకపోగా.. అనూహ్యంగా మూడో వంతు పడిపోవడం జపాక్‌కు షాక్ ఇచ్చింది. ఇలా ఎందుకు జరిగిందన్న విశ్లేషణ మొదలైంది.
మరి ఎందుకు వ్యూయర్ షిప్ తగ్గింది.. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అసలు మొత్తం ఒలింపిక్స్ పైనే ప్రపంచ ప్రజలకు ఆసక్తి తగ్గింది. ఎందుకంటే.. వీటిలో ప్రధాన కారణం.. ఈ ఒలింపిక్స్‌లో కొత్త రికార్డులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులకు తక్కువ ఆస్కారం ఉంటోంది. గత పాతికేళ్లలో ఉన్నరికార్డులను దాటి కొత్త రికార్డులు నమోదు కావడం లేదు. అందువల్ల ప్రజలకు ఆసక్తి తగ్గుతోంది. గతంలో ప్రపంచ క్రీడలకు ఒలింపిక్స్ ఒక్కటే వేదిక.. కానీ ఇప్పుడు ఒలింపిక్స్ తో పాటు అనేక ప్రపంచ వేదికలు ఉన్నాయి. అందువల్ల ఒలింపిక్స్ మాత్రమే చూడాలన్న అవసరం లేకుండా పోయింది.
మరో కీలక అంశం ఏంటంటే.. ఇప్పుడు దేశాల మధ్య అంత పోటాపోటీ ఉండటం లేదు. గతంలో అమెరికా, రష్యా మధ్య ఉన్నట్టు ఇప్పుడు ఒలింపిక్స్ పతకాల కోసం దేశాల మధ్య బీభత్సమైన పోటీ లేదు. ఇలా అనేక అంశాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్‌పై ఆసక్తి తగ్గుతోంది.