యూపీ కోసం మళ్లీ మోదీ డేంజరస్ గేమ్..? ఇదిగో ఆర్బీఐ క్లూ..!

నరేంద్ర మోదీ.. ఎన్నికల్లో ఎలా నెగ్గాలో తెలిసిన నాయకుడు. ప్రతిసారీ గెలుపు ఎవరికీ సాధ్యం కాకపోయినా.. సొంత బలంతో నెగ్గి ప్రధాని అయిన కాంగ్రెసేతర ప్రధాని ఆయనే. అయితే దేశంలో అధికారంలో నిలుపుకోవాలంటే.. ఎంపీ సీట్లు కావాలి.. మరి ఏకంగా 80 సీట్లు ఉన్న యూపీ ఎంత ముఖ్యమో తెలుసు కదా. అలాంటి యూపీ కోసం మోదీ మరోసారి డేంజర్ గేమ్ ఆడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆ డేంజరస్ గేమ్ ఏంటి.. దాన్ని మళ్లీ ఆడటం ఏంటి.. చూద్దాం..

తాజా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక బయటపెట్టింది. అందులో ఫేక్ నోట్ల గురించి కీలక విషయాలను ఆర్బీఐ వెల్లడించింది. ఫేక్ కరెన్సీ మళ్లీ పెరుగుతోందని.. ప్రత్యేకించి రూ. 500 నోట్ల ఫేక్ కరెన్సీ 31.4 శాతం పెరిగిందని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. మన దేశంలో ఫేక్ కరెన్సీ విచ్చలవిడిగా చలామణి కావడంపై రిజర్వ్ బ్యాంకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మన వ్యవస్థలో దొంగనోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.

ప్రత్యేకించి రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని ఆర్బీఐ తెలిపింది. రూ. 500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. అయితే ఇతర డినామినేషన్ నోట్ల ఫేక్ కరెన్సీ మాత్రం తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 39,453 ఫేక్ రూ. 500 నోట్లను ఆర్బీఐ గుర్తించింది.

అయితే ఈ ఫేక్ నోట్లకీ యూపీ ఎన్నికలకూ లింకేంటి అంటారా.. అక్కడే అసలు కథ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా గతంలోనూ యూపీ ఎన్నికల ముందే మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశానికి వచ్చిన లాభం ఏమో కానీ.. ప్రతిపక్షాల వద్ద డబ్బు లేకుండా చేసి.. దాన్ని ఎన్నికల సమయంలో తనకు అనుకూలంగా మలచుకున్నారన్న వాదనలు ఉన్నాయి.

మళ్లీ ఇప్పుడు యూపీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఆర్బీఐ ఈ ఫేక్ నోట్ల విషయాన్ని బయటపెట్టింది. ఈ రెండు విషయాలను కాస్త అనుమానం కోణంలో చూస్తే.. మోదీ మరోసారి పెద్ద నోట్ల రద్దు తరహాలో 500 నోట్ల రద్దు వంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటున్నారా అనిపించకమానదు. మరి ఇది నిజమో కాదో.. కొన్నాళ్లు ఆగితే కానీ.. ఓ క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: