ఈటెల భార్య కులం.. ఆయనకు ప్లస్సా..? మైనస్సా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కులం ముదిరాజ్.. ఇది బీసీల్లో వెనుకబడిన కులంగా ఉంది. ఆయన తనను తాను ముదిరాజ్ బిడ్డగా మొన్న చెప్పుకున్నారు. ముదిరాజ్‌లు ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాడతారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ముదిరాజ్‌లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఆ విధంగా ఆయన కులం ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. బడుగుల నేతగా ఈటలకు గుర్తింపు ఉంది. అయితే ఆయన జమునను ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈటల భార్య జమునది రెడ్డి కులం. ఆమె తన పిల్లల పేరులోనూ రెడ్డి ఉంచారు. దీంతో ఈటల కుమారుడి పేరు భరత్ రెడ్డిగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు ఇది ఈటలకు రాజకీయంగా మైనస్ అవుతుందని కొందరు వాదిస్తున్నారు. బడుగుల నేతగా చెప్పుకునే వ్యక్తి కుమారుడికి అగ్రకులం పేరు ఉండటం వల్ల కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలను బడుగు దొర అంటూ విమర్శిస్తున్నారు. ఆర్థికంగానూ ఈటల స్థితిమంతుడు కావడంతో భార్య కులం ఈటలకు బడుగుల నేత అన్న ఇమేజ్‌ను దూరం చేసే ప్రమాదం ఉంది.
అయితే.. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా రాజకీయ ప్రాముఖ్యత ఉన్న సామాజిక వర్గం. ఈటల భార్య జమున కులం రెడ్డి కావడం వల్ల ఈటలకు రెడ్డి వర్గీయులు మద్దతు దక్కే అవకాశం ఉందన్నది మరికొందరి వాదన. ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు ఈటలకు మద్దతు ఇస్తున్నారు. ఈ విధంగా భార్య కులం ఈటలకు ప్లస్ అవుతుందన్నది మరో వాదన. మరి భార్య కులం ఈటలకు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అన్నది భవిష్యత్‌లో తేలుతుంది.