హెరాల్డ్ ఎడిటోరియల్ : వచ్చే ఎన్నికల తర్వాత పరిస్ధితేంటో చెప్పిన ఎల్లోమీడియా

Vijaya
మరో మూడేళ్ళ తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఫలతం ఎలా ఉండబోతోందో ఎల్లోమీడియా చెప్పేసింది. ప్రతి ఆదివారం రాసే కొ(చె)త్తపలుకులో ఎల్లోమీడియా ఎండి రాధాకృష్ణ తాజాగా రాసిన చెత్తపలుకులో చంద్రబాబునాయుడుకు రాజకీయంగా భవిష్యత్తు లేదని చెప్పకనే చెప్పేశారు. దీనికి ప్రాతిపదిక ఏమిటయ్యా అంటే మొన్ననే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికట.యావత్ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో జగన్మోహన్ రెడ్డి బారీఎత్తున రిగ్గింగ్ చేసుకున్నట్లు ఎల్లోమీడియా తేల్చేసింది. ఇది ఒక ట్రైలర్ మాత్రమేనని వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇదే పద్దతిని జగన్ అమలు చేయరని గ్యారెంటీ ఏమీలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఎల్లోమీడియా చెప్పిందాట్లో అర్ధమేంటి ?



తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ గెలవబోతున్నట్లే మూడేళ్ళ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుస్తుందని జోస్యం చెప్పటమే కదా. 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారంటే చంద్రబాబు పరిస్ధితి ఏమిటి ? అంటే ఆ తర్వాత టీడీపీ జెండా ఎత్తేయటం ఖాయమని ఎల్లోమీడియాకు అర్ధమైపోయినట్లుంది. ఎలాగూ తెలంగాణాలో టీడీపీ ఎత్తిపోయింది. ఇదే పరిస్ధితి మరో మూడేళ్ళ తర్వాత ఏపిలో కూడా రావటం ఖాయమని ఎల్లోమీడియా ఇపుడే ఫిక్సయిపోయింది. అందుకనే రిగ్గింగ్ చేయించుకుని జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని, కేంద్రం కూడా జగన్ కే సాయం చేస్తుందని తెగబాధపడిపోయారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో భాగంగా తిరుపతి నగరంలో వైసీపీ దొంగఓట్లేయించుకున్నదని చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్నది.



ఒకవేళ వైసీపీ దొంగఓట్లు వేయించుకోవటమే నిజమైతే మరి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఏమి చేస్తోంది ? టీడీపీ నేతలు చెబుతున్నట్లు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే టీడీపీ పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుండి వెళ్ళిపోయారట. మరదే నిజమైతే పోలింగ్ ఏజెంట్లు కేంద్రాల నుండి ఎందుకెళ్ళిపోయారు ? అసలు దొంగఓట్లు వేస్తున్నవారిని టీడీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారా ? ఎక్కడా అప్పగించలేదు. దొంగఓట్లంటు ఊరికే తమకు మద్దతుగా ఉండే మీడియాలో గోల చేయటం తప్ప గట్టి ప్రతిపక్షంగా టీడీపీ చేసిందేమీలేదు. నిజానికి వైసీపీ నిజంగానే దొంగఓట్లేయించుకునే ఉంటే అందుకు కారణం టీడీపీ అనే చెప్పాలి. 2014-19 మధ్యలో జరిగిన  తిరుపతి, నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అనుసరించారో ఇపుడు జగన్ కూడా అదే పద్దతిలో వెళుతున్నారంతే. అప్పుడు చంద్రబాబు చేస్తే ఒప్పయ్యింది ఇపుడు జగన్ చేస్తే తప్పవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: