హెరాల్డ్ ఎడిటోరియల్ : గీతంను వెంటాడుతున్న వైసీపీ ఎంపి
అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పరిణామాల్లో వెలుగుచూసిన వాస్తవాలతోనే గీతం యాజమాన్యం అసలు రహస్యం బట్టబయలైంది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా రికార్డుల్లో చూపించేసుకుని శాశ్వత భవనాలు కట్టేసుకుంది. ఏఐసిటిఇ, యూజీసీ నుండి తనిఖీలకు కమిటీలు వచ్చినపుడు అవసరమైన భూమి, అవసరమైన శాశ్వత భవనాలు కనబడగానే కమిటిలు సంతృప్తి చెంది అవసరమైన అనుమతులు ఇచ్చేశాయి. అయితే ఇపుడు బయటపడిందేమంటే అసలు భూములు గీతం యాజమాన్యంవి కానేకాదని. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదని తేలిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసి రికార్డుల్లో తమదిగా చూపించేసుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్లు చూపించినపుడు కూడా రికార్డల పరంగా తమ భూమే అని చూపించటంతో కమిటిలు కూడా ఓకే చెప్పేశాయి. పైగా రాజకీయంగా బలమైన నేపధ్యమున్న యాజమాన్యం కావటంతో అనుమతులకు అడ్డేలేకపోయింది.
యూజీసీని, ఐఏసిటీఇని గీతం యాజమాన్యం ఏ విధంగా మోసం చేసిందో ఆధారాలతో సహా పై సంస్ధలకు ఎంపి ఫిర్యాదులు చేశారు. ఏఐసీటీఇ అనుమతులతో పాటు యూజీసీ అనుమతులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటి హోదాను రద్దు చేయాలని తన ఫిర్యాదులో కోరటం సంచలనంగా మారింది. గీతంకున్న స్వతంత్రహోదాను రద్దు చేసి ఆంధ్ర యూనివర్సిటికి అఫిలియేట్ చేయాలని సూచించారు. మొత్తానికి గీతం యాజమాన్యం అక్రమాలు, అవినీతిని ఎంపి వెంటాడుతున్న విషయం అర్ధమైపోతోంది. మరి దీనికి ముగింపు ఎలాగుంటుందో చూడాల్సిందే.