బాలు మరణానికి రామోజీరావు కారణమా.. అసలు నిజం ఏంటి..?
ఎస్పీ బాలును సామజవరగమన కార్యక్రమం కోసం రావాలని రామోజీరావు బలవంతం చేశారని.. వయోభారంతో తాను చెన్నై నుంచి రాలేనని ఆయన చెప్పినా వినలేదని.. రావాల్సిందేనని బలవంతం చేశారని.. ఏవో అగ్రిమెంట్ల కాయితాలు చూపి బెదిరించారని.. ఇలా ఇష్టారాజ్యంగా విశ్లేణలు రాస్తున్నారు. ఇవన్నీ రామోజీరావుపై బురద జల్లాలలని చేస్తున్న ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అలాగే ఎక్కడో తమిళ ఛానల్‌కు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ.. అదేదో రామోజీ ఫిలిం సిటీలో జరిగిన షూటింగ్‌గా చెబుతూ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇవన్నీ రామోజీరావుకు బాలుకు ఉన్న అనుబంధం తెలియని వ్యక్తులు... తెలిసీ కావాలనే బురద జల్లుతున్న ప్రయత్నంగా చూడాలి. రామోజీ బాలు మధ్య అనుబంధం గురించి తెలిసినవారెవరూ ఇలాంటి విశ్లేషణలు రాయరు.. ప్రచారం చేయరు. సామజవరగమన కార్యక్రమానికి రావాలని బాలును ఈటీవీ కోరి ఉండొచ్చు.. ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమం కాబట్టి.. అప్పటికే షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి అడిగి ఉండొచ్చు. అంతే కానీ.. బలవంతం చేశారు.. అగ్రిమెంట్లు చూపించి బెదిరించారని ప్రచారం చేయడం దుర్మార్గం.
ఓసారి ఎస్పీ బాలు హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఎయిర్‌పోర్టుకు కారు రాకపోతే.. ఆయన ఏం చేయాలో తెలియక రామోజీరావుకు ఫోన్ చేశారట. ఆయన సరే కారు పంపిస్తానని చెప్పి.. వెంటనే అంతటి రామోజీరావే స్వయంగా డ్రైవర్‌గా మారి కారు నడుపుకుంటూ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వయంగా కారులో ఇంటి వద్ద దింపారట. ఇక ఈటీవీతో బాలు అనుబంధం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ.. చివరకు బాలు మరణాన్ని రామోజీకి అంటగడుతున్న తీరు దారుణం.. అత్యంత అమానుషం.