హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాలపై జగన్ మాస్టర్ స్ట్రోక్.. దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఫ్లాట్
రథం తగలబడటానికి బాధ్యులెవరో ఎవరికీ తెలీదు. అసలు ఎందుకు తగలబెట్టారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం పోలీసులతో విచారణ చేయిద్దామని అనుకున్నది. దాన్ని అవకాశంగా తీసుకుని బిజెపి+జనసేనతో పాటు టిడిపి కూడా నానా యాగీ మొదలుపెట్టింది. రథం తగలబడటంలో ప్రభుత్వందే బాధ్యతంటూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు రెచ్చిపోతున్నాడు. ఇక చంద్రబాబునాయుడు గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్ సిఎం అయిన తర్వాతే హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని, దేవాలయాల్లో అపచారాలు జరిగిపోతున్నట్లు గోల చేసేస్తున్నాడు. తన హయాంలో 36 దేవాలయాలను కూల్చేసిన ఘటనను చంద్రబాబు కన్వీనియంట్ గా మరచిపోయాడు. తిరుమలకు వెళ్ళే బస్సుల టిక్కెట్ల వెనుక ఇజ్రాయెల్, మక్కా మశీదు యాత్రల గురించి టిడిపి ప్రభుత్వం చేసుకున్న ప్రచారం గురించి కూడా చంద్రబాబు నోరిప్పటం లేదు.
ఇంతమంది మాట్లాడుతున్నపుడు పవన్ మాత్రం ఎందుకూరుకుంటాడు. రథం తగలబడిన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఏకంగా దీక్షే చేయబోతున్నట్లు ప్రకటించేశాడు. జరిగిన ఘటన నుండి రాజకీయ లబ్దిపొందాలని ప్రతిపక్షాలు చేయని ప్రయత్నాలు లేవు. అధికారపార్టీ నరసాపురం ఎంపి రఘుకృష్ణంరాజు అయితే ఘటన వెనుక మతపరమైన కుట్రుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేశాడు. జగన్ మీద తనకున్న కసినంతా ఎంపి+ఎల్లోమీడియాలు తీర్చేసుకుంటున్నాయి. అంటే ఒకరకంగా జగన్ ను హిందువులకు దూరం చేసేందుకు ప్రయత్నాలను చాలా పెద్ద ఎత్తున మొదలుపెట్టేశాయి. ఎలాగూ తగలబడింది దేవుడి రథం కాబట్టి భక్తుల్లో కూడా సెంటిమెంటు ఉంటుంది. దాన్నే క్యాష్ చేసుకుందామని ప్రతిపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.