అయ్యో..పాపం.. చంద్రబాబు కష్టం అంతా వృథా అయిపోతోందే...?

చంద్రబాబునాయుడు.. తన కాలంలో డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకున్న నాయకుడు. అధికారులను పరుగులు పెట్టించడంలోనూ.. సమీక్షలు నిర్వహించడంలోనూ  దిట్ట. అయితే అదంతా తనకు అనుకూలమైన మీడియాలో కవరేజ్ కోసమే చంద్రబాబు చేస్తుంటారన్న విమర్శలూ ఉన్నాయి.

 


అయితే ఇప్పుడు తాను ప్రతిపక్షనేత.. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నిలదీయాలు.. ప్రజాసమస్యలపై పోరాడాలి. అంత వరకూ ఓకే.. కానీ.. పాపం.. చంద్రబాబు అప్పుడప్పుడు అంతకంటే ఎక్కువే చేస్తుంటారు. కానీ ఫలితం కనిపించదు.. తాజాగా అలాంటి విషయం ఒకటి జరిగింది.  

 


అదేంటంటే.. కరోనాను ఎలా కట్టడి చేయాలి అనే అంశంపై శనివారం కొందరు వైద్యులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏదీ మీటింగ్ అంటే అల్లాటప్పాగా కాదు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలా గంటల తరబడి సమీక్షలు జరిగేవో..ఇదీ అలాగే సాగింది. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ ను అన్నివిధాలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఈ సమావేశంలో అన్నారు. 

 


గంటల తరబడి ఈ సమావేశం జరిగిందంటే.. ఎంత చర్చించి ఉంటారు.. ప్రజల కోసం ఎన్ని సలహాలు ఆ వైద్యులు చెప్పి ఉంటారు.. కానీ ఏం లాభం.. ఆ సలహాలు పాటింపజేసే అధికారం మాత్రం చంద్రబాబు దగ్గర లేకుండా పోయింది కదా.. ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటేనా.. కానీ ఏం చేస్తాం.. చంద్రబాబు కష్టం ఇలా వృథా అవుతుంటే చూస్తూ ఉరుకోవడం తప్ప..!? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: