
జగన్ నెక్ట్స్ టార్గెట్ ఆ టాప్ లీడరే... నిజం ఒప్పుకుంటోన్న టీడీపీ.. ఫ్రూప్ ఇదిగో...?
ఏపీ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు పట్టడం లేదట. తెల్లవారితో ఏం జరుగుతుంది ? అసలు ఐదేళ్ల పాటు ప్రభుత్వం ఉండడంతో కన్ను మిన్ను కానకుండా అడ్డగోలుగా దోచుకున్న దోపిడీ బట్ట బయలు అవుతుందా ? తమను సడెన్‌గా పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకు పోతారా ? తమ బండారం బట్ట బయలు అవుతుందా ? అని ఒకటే టెన్షన్ పడిపోతున్నారట. ఇప్పటికే అరెస్టు అయిన అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డే కాదు... ఇప్పుడు లోకేష్ నుంచి పలువురు మాజీ మంత్రుల వరకు ఒక్కటే బాబ్కాబు తమను కాపాడు దేవుడా ? అని వేన్నోళ్లు మొక్కుకుంటున్నారట.
ఇక అచ్చెన్న అవినీతి చేశాడా ? లేదా ? అన్నది కాసేపు పక్కన పెట్టేద్దాం. అచ్చెన్నను అరెస్టు చేయలేదు.. కిడ్నాప్ చేశారని సన్నాయి నోక్కులు నొక్కుతోన్న టీడీపీ వాళ్లు, బాబోరు, చినబాబోరు ధైర్యంగా అచ్చెన్న అవినీతి చేయలేదన్న మాట మాత్రం చెప్పడం లేదు. అంటే అచ్చెన్న అవినీతి చేయలేదన్న విషయం మాత్రం వీళ్లు ఒప్పుకోవడం లేదు. అంటే చేశాడని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టేనా ? మరి అలాంటప్పుడు ఈ దొంగ ఏడుపులు ఎందుకు ? ఇక ఈ లిస్టులో మరిన్ని పెద్ద పాములు బయటకు వస్తాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఇక చాలా మంది మంత్రులు గత ప్రభుత్వంలో చినబాబోరు లోకేష్ చెప్పినట్టు చేశారు. ఆయన ఆడమంటే ఆడారు..పాడమంటే పాడారు.. లోకేష్ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టారు. ఇప్పుడు నిండా మునిగి పోతున్నారు. ఎప్పుడు కేసులు ముంచుకు వస్తాయో ? తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో నెక్ట్స్ మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయబోతున్నారంటూ ఓ పోస్ట్ పెట్టుకుంది.
అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినప్పుడు బీసీ మంత్రం పటిస్తూ సరి కొత్త డ్రామా ఆడిన బాబోరు బ్యాచ్ ఇప్పుడు అయ్యన్న పాత్రుడి కోసం మరో డ్రామాకు తెరదీస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తెలుగుదేశం బీసీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. వైసీపీ అరాచకాలపై గళమెత్తుతున్న ప్రతి బీసీ నేతను టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఇప్పటివరకు 6 దొంగ కేసులు పెట్టారు అంటూ పోస్ట్ పెట్టింది. బాబోరు బ్యాచ్ అయితే నెక్ట్స్ అయ్యన్నే జగన్ టార్గెట్ అని చర్చించు కుంటున్నారు. వాస్తవంగా తప్పు చేయని వాళ్ల విషయంలో ఇంత హడావిడి ఎందుకు జరుగుతోందో ? అర్థం కాని పరిస్థితి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తెలుగుదేశం బీసీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. వైసీపీ అరాచకాలపై గళమెత్తుతున్న ప్రతి బీసీ నేతను టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి @AyyannaPatruduC పై ఇప్పటివరకు 6 దొంగ కేసులు పెట్టారు#BCsHarassedByJagan pic.twitter.com/jWTftlNeEK — telugu desam party #StayHomeSaveLives (@JaiTDP) June 16, 2020