అక్క‌డ తొలిసారిగా హెలీరైడ్ ఏర్పాటు.. ఎక్క‌డంటే...?

N ANJANEYULU
ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకొని ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకునేందుకు విజ‌య‌వాడ‌లో మొద‌టిసారిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డు ఏర్పాటు చేయ‌ని విధంగా  విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇందులో మూడువేల మంది పోలీసులు, సీసీకెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో క‌ట్టుదిట్టంగా చేప‌డుతున్నారు.  సంద‌ర్శ‌కుల కోసం ప్రారంభించిన హెలీ టూరిజం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇవాళ మూడో రోజు గాయ‌త్రీదేవీ అవ‌తారంతో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇచ్చారు. వైభ‌వంగా శ‌ర‌న్న‌వ‌రాత్రులు నిర్వ‌హిస్తున్నారు.

ఆకాశంలో విహ‌రిస్తూ విజ‌య‌వాడ న‌గ‌రం అందాల్ని, దుర్గ‌మ్మ ఆల‌యం ప్రాంగ‌ణంలో నిర్వ‌హించే ఉత్స‌వాల‌ను పై నుంచి వీక్షించే వెసులుబాటు ఉంటుంది. కృష్ణానది తీరంలో  హెలీప్యాడ్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల  వీఎంసీ అధికారులు సన్నాహాలు చేయ‌డం అద్భుతం అని ప‌లువురు పేర్కొంటున్నారు.
అదేవిధంగా ఆన్‌లైన్‌ టికెట్ తీసుకురాకుండా వచ్చిన భక్తులకు అప్పటి కి అప్పుడే  దర్శనం టికెట్లు విక్రయించేందుకు వీఎంసీ కార్యాలయం స‌మీపంలో ఉన్న  దుర్గగుడి టోల్‌గేట్,  ఒంటర్నింగ్‌ల వద్ద కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

అందుబాటులోకి వ‌చ్చిన హెలీ రైడ్ 6 నిమిషాల‌కు రూ.3500 చొప్పున‌, 15 నిమిషాల‌కు రూ.6వేల వ‌ర‌కు తీసుకోనున్న‌ట్టు వెల్ల‌డించారు. ఏపీలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్న‌ట్టు వెల్ల‌డించారు. విజ‌య‌వాడ‌లో హెలీటూరిజం అనేది అందుబాటులోకి రావ‌డం మొద‌టిసారి అని అభిమానులు అనుకుంటున్నారు. తుంబై ఏవియేష‌న్ సంస్థ ఒకేసారి ఆరుగురు ప్ర‌యాణించేందుకు వీలు క‌ల్పించింది. ఇంద్ర‌కిలాద్రి దేవాల‌యంతో పాటు ప్ర‌కాశం బ్యారేజ్‌, న‌గ‌ర అందాల‌ను తిల‌కించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఈ హెలీ రైడ్స్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్య‌ట‌క శాఖ‌, విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉంది. మ‌రోవైపు ఇంద్ర‌కిలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌ర‌కు టికెట్లు, ప్రసాద విక్ర‌యాల ద్వారా రూ.17.70 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్టు ఆల‌య ఈవో బ్ర‌మ‌రాంబ వెల్ల‌డించారు. శ‌నివారం అమ్మ‌వారు గాయ‌త్రీదేవి అలంక‌ర‌ణ‌లో ద‌ర్శ‌నం ఇచ్చింది. గాయ‌త్రీ అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యం, స‌క‌ల మంత్ర‌సిద్ధి, తేజ‌స్సు, జ్ఞానం పొందుతారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఉం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: