అదుర్స్ అంటున్న ఏఆర్ రెహమాన్ బ‌తుక‌మ్మ సాంగ్

N ANJANEYULU
సాధార‌ణంగా ఎక్క‌డైనా ఎవ‌రైనా దేవుళ్లను, దేవ‌త‌ల‌ను పువ్వుల‌తో పూజిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రాంతంలో పువ్వుల‌ను అమ్మ‌వారిగా భావించి పూజిస్తారు. తెలంగాణ‌లో మ‌హాల‌య అమ‌వాస్య‌(పెత్త‌ర అమ‌వాస్య‌) రోజు ప్రారంభించి.. దాదాపు 9 రోజుల పాటు తీరొక్క పువ్వుల‌తో బ‌తుక‌మ్మ‌ను పేర్చి ఆడుతుంటారు తెలంగాణ మ‌హిళ‌లు. ఒక్కోరోజు ఒక అమ్మ‌వారి లాగా ద‌ర్శ‌నం ఇస్తుంటారు. బ‌తుక‌మ్మ మొద‌టి రోజు ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌, రెండో రోజు అటుకుల బ‌తుక‌మ్మ‌, మూడో రోజు ముద్ద‌పప్పు బ‌తుక‌మ్మ, నాలుగ‌వ రోజు నాన‌బియ్యం బ‌తుక‌మ్మ‌, ఐదో రోజు అట్ల బ‌తుక‌మ్మ‌, ఆరో రోజు అలిగిన బ‌తుక‌మ్మ‌, ఏడోరోజు వేప‌కాయ‌ల బ‌తుక‌మ్మ‌, ఎనిమిద‌వ రోజు వెన్న‌ముద్ద‌ల బ‌తుకమ్మ‌, తొమిదో రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ‌గా జ‌రుపుకుంటారు.

 ప‌ల్లె నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు తొమ్మిది రోజులు ఘ‌నంగా బతుక‌మ్మ సంబ‌రాలు నిర్వ‌హించుకుంటారు. ఈ మ‌ధ్య కాలంలో బ‌తుక‌మ్మ పాట‌లు పాపుల‌ర్ అవుతున్నాయి. ఏడాదికి ఒక కొత్త పాట‌ను విడుద‌ల చేస్తున్నారు. అదేవిధంగా బ‌తుక‌మ్మ పాట‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సైతం ప్ర‌త్యేక దృష్టి సారిస్తోంది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ‌తుక‌మ్మ పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈసారి బ‌తుక‌మ్మ పాటను ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. బ‌తుక‌మ్మ‌ను ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుపుకుంటారు. బ‌తుక‌మ్మ పండుగ‌కు ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగి ఉన్న‌ది. అమెరికాలో సైతం బ‌తుక‌మ్మ సంబురాలు నిర్వ‌హించుకుంటారు. ఎప్పుడు ద‌స‌రా పండుగ వ‌చ్చినా బ‌తుక‌మ్మ పండుగ‌కు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటుంది.

 తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాలు అద్దం ప‌ట్టేలా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మ‌న్, ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ లు బ‌తుక‌మ్మ పాట‌ను రూపొందించారు. హైద‌రాబాద్ న‌గ‌ర స‌మీపంలో ఉన్న భూదాన్ పోచంప‌ల్లిలో అల్లిపూల వెన్నెల అనే బ‌తుక‌మ్మ పాట‌ను చిత్రీక‌రించారు. ఈపాట‌ను విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన వెంట‌నే ప్ర‌జాదార‌ణ పొందింది. ఎప్పుడు ఎప్పుడాని ప్ర‌జ‌లు ఎదురుచూశారు. తెలంగాణ   రాష్ట్రంలో అక్టోబ‌ర్ 6 నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ బ‌తుక‌మ్మ పాట‌ను ఇత‌ర భాష‌ల్లోకి సైతం అనువాదించ‌నున్నారు. మొత్తానికి ఏ ఆర్ రెహ‌మాన్‌, గౌత‌మ్‌మీన‌న్ రూపొందించిన పాటకు తెలంగాణ మ‌హిళ‌లు  బ‌తుక‌మ్మ ఆట పాట‌ల‌తో బ‌తుక‌మ్మ పండుగ జ‌రుపుకోనున్నారు.  ఇక సినీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌, సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ రూపొందిచిన ఈ సాంగ్ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుంది. ఇంక ముందు ముందు ఎంత పాపుల‌ర్ అవుతుందో వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: