జ‌య‌ల‌లిత‌కు శిశిక‌ళ‌కు మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి..?

MADDIBOINA AJAY KUMAR
భారత రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అన్నాడీఎంకే అధినేతగా ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా జయలలిత ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. అయితే జయలలితకు అత్యంత సన్నిహితులైన శశికళ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. శశికళ భర్త నటరాజన్ ప్రభుత్వ పిఆర్ఓ గా పనిచేశారు. శశికళ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలను తీస్తూ ఉండేవారు. ఓ క‌లెక్ట‌ర్ శ‌శిక‌ళ‌కు కెమెరాను బ‌హుమ‌తిగా ఇచ్చి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీయ‌మ‌ని చెప్పారు. అయితే అదే సమయంలో ఎంజీఆర్ జయలలితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1982 లో రాజ్యసభకు ఎంపిక చేశారు. కాగా మధురైలో జరిగిన ఒక సభలో జ‌య‌ల‌లిత ప్ర‌సంగించ‌గా శశికళ ఫోటోలు వీడియోలు తీశారు. 



ఆ సమయంలో శశికళ, జ‌య‌ల‌లిత‌ల‌ మధ్య పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన వీరి పరిచయం రెండేళ్లకే మరింత బలపడింది. దాంతో శశికళ జయలలిత ఇంట్లో బాధ్యతలు అన్నీ తానే చూసుకునే స్థాయికి వచ్చింది. మూడు దశాబ్దాల పాటు శశికళ జయలలిత వెంట నడిచింది. అన్నాడిఎంకె వీడియో గ్రాఫర్ గా శశికళ త‌న‌ కెరీర్ ను ప్రారంభించి జయలలిత పక్కన నిలబడే ఆ స్థాయికి ఎదిగింది. ఎక్కువ సందర్భాల్లో జయలలిత.. శశికళ క‌లిసి స్టేజిని పంచుకున్నారంటే శ‌శిక‌ల‌కు జ‌య‌ల‌లిత ఎంత‌టి ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. జ‌య‌ల‌లిత‌కు శ‌శిక‌ల ఓ చెల్లిగా, స్నేహితురాలిగా, రాజకీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించి జ‌య‌ల‌లిత అంటే శ‌శిక‌ల గుర్తుకు వ‌చ్చేలా త‌యారైంది.

 

జ‌య‌ల‌లిత విజ‌యాల్లోనూ అప‌జ‌యాల్లోనూ త‌న వంతు పాత్ర శ‌శిక‌ల పోశించింది అనడంలో ఎటువంటి సందేహ‌మూ లేదు. 2012లో శశికళ, జ‌య‌ల‌లిత‌ ల మధ్య బంధం చెడి దూరమైనా జయలలిత అనారోగ్యం పాలవడంతో మళ్లీ శ‌శిక‌ల ఆమె వద్దకు చేరి 75 రోజుల పాటు ఆసుపత్రిలో సేవ చేసింది. అంతేకాకుండా జయలలిత అంతిమ సంస్కారాల స‌మ‌యంలోనూ శశికళ అన్నీ తానై కార్యక్రమాలు చూసుకున్నారు. మరోవైపు జయలలిత కూడా తన మరణానంతరం ఆస్థుల‌న్నీ కూడా శశికళకు చెందాలని ఒక వీలునామా కూడా రాసినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: