స్పేస్‌ టూర్‌కు రెడీ అవుతున్న అమెజాన్‌

Podili Ravindranath
స్పేస్‌ టూరిజంకు గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్‌ సంస్థ యజమాని రిచర్డ్ బ్రాన్సన్‌ స్పేస్‌ టూర్‌ పూర్తిచేసి రాగా... మరో అద్భుతానికి అమెజాన్ సంస్థ రెడీ అవుతోంది. మరికొద్ది గంటల్లో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌... అంతరిక్షపు అంచుల వరకు వెళ్లి రానున్నారు. రాబోయే రోజుల్లో స్పేస్‌ టూరిజానికి మరింత గిరాకీ ఉంటుందని ఇప్పటికే మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస టూర్లతో స్పేస్ బిజీబిజీగా మారుతోంది. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు నుంచి కంటున్న కలను బెజోస్ ఈ రోజు నిజం చేసుకోబోతున్నారు.
ఫస్ట్‌ స్పేస్‌ టూర్‌తో వర్జిన్ గెలాక్టిక్‌ వారెవ్వా అనిపిస్తే... అంతకు మించి అద్భుతాలను సాధిస్తామంటోది అమెజాన్. తన సొంత అంతరిక్ష ప్రయోగ సంస్థ బ్లూ ఆరిజన్‌ చేపట్టిన తొలి మానవసహిత రోదసి యాత్రకు  అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ  పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న బెజోస్‌... విచిత్రంగా తనతో పాటు ఓ 82 ఏళ్ల వయసున్న బామ్మను కూడా తీసుకెళ్తున్నాడు. గతంలో పైలెట్‌గా పనిచేసిన వేలీ ఫంక్ అనే వృద్ధురాలు కూడా తనతో పాటు స్పేస్‌ టూర్‌కు వస్తున్నట్లు బెజోస్‌ స్వయంగా ప్రకటించాడు. ఈ టూర్‌లో జెఫ్‌  బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌ 82 ఏళ్ల వేలీ ఫంక్‌, 18 ఏళ్ల వయసున్న ఆలివర్‌ డేమన్‌ ఉన్నారు. ఈ పర్యటనతో ఎన్నో రికార్డులను బ్లూ ఆరిజిన్‌ సొంతం చేసుకుంటోంది. స్పేస్‌ టూర్‌లో అత్యంత పెద్ద వయసున్న వేలీ ఫంక్‌, అత్యంత చిన్న వయసున్న ఆలివర్‌ డేమన్‌లు బ్లూ ఆరిజిన్‌లో అంతరిక్ష పర్యటన చేస్తున్నారు. మొత్తం 11 నిమిషాల పాటు సాగనున్న ఈ యాత్ర... భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై... 6 గంటల 41 నిమిషాలకు ముగుస్తుంది. సో బీ రెడీ ఫర్ స్పేస్‌ టూర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: