విద్యార్థులకు గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాలో డబ్బులు పడేది అప్పుడే!

Purushottham Vinay
ఇక ఇప్పటికే విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో విద్యా కానుక ఒకటి ఇంకా మరోకటి అమ్మ ఒడి పథకాలు.. విద్యా కానుక కింద విద్యార్థులకు కావలసిన పుస్తకాలను, బ్యాగ్స్ ఇంకా అలాగే తదితర వస్తువులను అందజేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో విద్యార్థులకు మొత్తం 15 వేల నగదును అంద చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అనేది అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా కూడా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇంకా ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.ఇక మొదట 2022 జనవరిలో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. వివిధ కారాణాలతో అమ్మ ఒడి డబ్బులు విడుదల చేసే తేదీని ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ అమ్మఒడి పథకం ఈ ఏడాది ఆలస్యం అవ్వడంపై పలు అనుమానాలు అనేవి నెలకొన్నాయి. అలాగే షరుతులు కూడా పెంచినట్టు ప్రచారం అనేది ఉంది. దీంతో ఈ సారి అమ్మఒడి పథకం ఎప్పుడా ఎప్పుడా అని అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఈ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులు తల్లుల అకౌంట్లో జమ అయ్యాయి.


ఇప్పుడు మూడో విడుత సాయాన్ని కూడా త్వరలోనే జమ చేయనున్నారు.. తాజాగా ఈ విషయం పై మరో అప్డేట్ ను కూడా అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 27వ తేదీన అమ్మ ఒడి డబ్బులను తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు.అలాగే సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన లో భాగంగా బటన్ నొక్కి మూడో విడత డబ్బులను కూడా విడుదల చేస్తారు.ఇక ఈ ఏడాదికి 41 లక్షల మంది ఈ సాయన్ని పొందనున్నారు. అయితే ఈ సారి చాలామంది లబ్ధిదారుల పేర్లు అనేవి మిస్ అయినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని షరుతులతో ప్రభుత్వం తొలగించిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఇక కొత్తగా చేరిన లబ్ధి దారుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది.అయితే, ఈ జాబితాలో తమ పేర్లు కూడా లేవని చాలా మంది తల్లులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇక అలా ఎవరైనా తాము అర్హులమకాదా అని చెక్ చేసుకోవాలి అంటే.. గ్రామ ఇంకా వార్డు సచివాలయంకు వెళ్లి తెలుసుకోవచ్చు.. లేదా వాలంటీరును సంప్రదించిన ఆ లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: