దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా?

Divya

దేశం కోసం ఎంతోమంది పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం, దేశం కోసం తమ  ప్రాణాలనే అర్పించారు ఎంతో మంది మహనీయులు.అలాంటివారు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంటారు. మనలో కూడా చాలా మందికి దేశం కోసం పోరాడాలని అనుకునేవారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆర్మీ. కేవలం ఆర్మీ లో చేరితేనే దేశం కోసం పోరాడగలమా? ఆర్మీ లో చేరకుండా దేశం కోసం పోరాడలేమా? అనే సందేహం నాతో పాటు మీకు కలగవచ్చు. కానీ ఆర్మీ లో చేరితే ఒక రకంగా దేశం కోసం సహాయపడడానికి సులభమైన మార్గంఎంచుకున్నవారమవుతాం . ప్రస్తుతం ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ  నిర్వహిస్తోంది.

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ  సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లోని  యూనిట్ హెడ్‌క్వార్డర్స్‌లో ఈ ర్యాలీ జరగనుంది.  ఇక వచ్చే 2021 జనవరి 18 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అయితే జనవరిలో కరుణ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. లేదంటే ఈ రాళ్లను పోస్ట్పోన్ చేసే అవకాశం కూడా ఉంది.
 ఖాళీల వివరాలు:
సోల్జర్ టెక్ (AE),
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD),
సోల్జర్ ట్రేడ్‌మెన్,
ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్.
క్రీడలు :
బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ లాంటి క్రీడల్లో  నైపుణ్యం ఉన్న వారికి 2021 జనవరి 15 న స్పోర్ట్స్ ట్రయిల్ జరగనుంది.
స్పోర్ట్స్ ట్రయిల్ జరుగు స్థలం :
సికింద్రాబాద్ లోని ఏ ఓ సి సెంటర్ లో ఉన్న థపర్  స్టేడియంలో ఉదయం ఎనిమిది గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులు నేషనల్ తోపాటు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్స్ సర్టిఫికెట్లు పొంది ఉండాలి. క్లీనింగ్ తేదీ నుంచి రెండేళ్ల లోపు తీసుకున్న సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి.
ఇక మీ సందేహాలను
https://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
airawat0804@nic.in మెయిల్ ఐడీకి మీ సందేహాలను పంపి సమాధానాలు తెలుసుకోవచ్చు.
విద్యార్హతలు :
1.సోల్జర్ జనరల్ డ్యూటీ (GD)పోస్ట్  - మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ
కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి.
2.సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. 3.సోల్జర్ టెక్ (AE) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి.
4.సోల్జర్ Clk/SKT పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 50 శాతం మార్కులు ఉండాలి.
అభ్యర్థుల వయస్సు:
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) కేటగిరీ -17.5 నుంచి 21 ఏళ్లు,
ఇతర కేటగిరీలకు 17.5 నుంచి 23 ఏళ్లు.
మరిన్ని వివరాలకు  Headquarters AOC Centre, east Marredpally, Trimulgherry, secunderabad (TS) 500015 అడ్రస్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: