బాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత ఎంపీ?

ఎంపీ కేశినేని నాని అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. విజయవాడ పార్లమెంటు స్థానంలో తను చెప్పిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు టికెట్లు ఇచ్చే ప్రణాళిక చేస్తున్నట్లు చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా నందిగామలో  సౌమ్య, బుద్ధా వెంకన్న టీమ్, కేశినేని చిన్నిలను ఎంకరేజ్ చేస్తూ నానిని తొక్కేయాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బుద్ద వెంకన్న టీమ్ అయితే ఏకంగా కేశినేనిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.  కేశినేని నాని ఎంపీగా గెలిచిన నాటి నుంచే చంద్రబాబు పై అసహనం వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సార్లు బహిరంగంగానే విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే.  సౌమ్య, బుద్ధ వెంకన్న, కేశినేని చిన్నిలతో ఆయనకు ఇబ్బంది ఉందని తెలుస్తోంది.

దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నాకు ఇబ్బంది లేదు. ఏ పార్టీకి తన సిద్ధాంతం నచ్చుతుందో వారికి అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధమని కేశినేని నాని ప్రకటించారు. బెజవాడ ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. మనసుకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్నారు.  వాస్తవంగా తెలుగుదేశం ఒక సర్వే చేయించుకుంది. గతంలో కమ్మ సామాజిక వర్గం కాకుండా గుంటూరులో ముస్లింను పెట్టి గెలిపించిన సందర్భం. బందరులో బీసీని పెట్టి గెలిపించుకున్న సందర్భాన్నిటీడీపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

అంటే కేశినేని నానికి రాబోయే రోజుల్లో టికెట్ వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ నుంచి  గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని ఒకరు. రాబోయే రోజుల్లో టీడీపీ అనుకూల పవనాలు వీస్తే విజయవాడలో ఎవరైనా గెలవవచ్చనే ధీమా టీడీపీ లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో కేశినేని లాంటి బలమైన లీడర్ ను  కాదనుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. మరి టీడీపీ కేశినేని మధ్య పోరు ఎంత వరకు కొనసాగుతుంది.  కేశినేని నాని టీడీపీని ప్రేమిస్తూనే చంద్రబాబును ద్వేషిస్తూ లాభం లేదని కొంతమంది వ్యాఖ్యనించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: