మోడీ మారకపోతే.. జనమే మార్చేస్తారు?

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆలోచన మారాలి, మోడీ ఆలోచన మారాలి అని అన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి రాహుల్ గాంధీ ఈ మాట అంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రజలు ప్రభుత్వం నుండి ఆశించడానికి అయితే చూస్తారు. కానీ తాము తమ నెత్తి పైన ప్రభుత్వం తలకు మించిన భారాన్ని వేస్తే భరించలేరు. అది కూడా మధ్య తరగతి వాళ్ళకి ఈ భారం అనేది పెను భారం అవుతుంది.

గతంలో పెట్రోల్, డీజిల్ రష్యా నుండి చీపుగా దొరుకుతున్నా, ఇక్కడ మాత్రం పెంచుకుంటూ పోయారు. అలా పెట్రోలు, డీజిల్ రేటు ఒక 90 రూపాయల దగ్గర్లోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం దాన్ని 74 రూపాయలకు తగ్గించింది గతంలో. అది అప్పుడు మోడీ క్రెడిట్ అని అందరూ సంతోషించారు. కానీ ఆ తర్వాత మళ్లీ నిర్లక్ష్యంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలను గాలికి వదిలేసినట్లుగా తెలుస్తుంది. దాంతో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మధ్యతరగతి వారు తలపై పెనుభారంగా మారాయి.

ఇక గ్యాస్ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని చాలా నిబ్బరంగా ఉన్నారు జనం మొన్నటి వరకు. కానీ ఇప్పుడు తాజాగా కేంద్ర సబ్సిడీ పోయింది, రాష్ట్రం సబ్సిడీ కూడా పోయేసరికి మధ్య తరగతి ప్రజలందరూ తల పట్టుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో బండ పైన 20,30 రూపాయలు పెరిగితేనే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసింది బిజెపి.

కానీ ఆ తర్వాత బండ పైన 700రూపాయల వరకు ఒక్కసారిగా పెంచేస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మీ జీతాలు పెరగడం లేదా, సరిహద్దులోని సైన్యం కోసం ఇదంతా చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారట. సైనికులు దేశానికి అవసరమే, కానీ మధ్య తరగతి వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా అని మధ్యతరగతి వాళ్ళు వాపోతున్నట్లుగా తెలుస్తుంది. గ్యాస్, పెట్రోలు వల్ల ఒక మధ్య తరగతి మనిషికి అదనంగా 1500 ఖర్చు అవుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: