ఒక మగాడు ఎందరికైనా వీర్య దానం చేయొచ్చా?

జనాభా ఎక్కువై కొన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే మరికొన్ని దేశాల్లో పిల్లలు పుట్టక జనాభా పెరగక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పిల్లలు కలగడం లేదు. 30 సంవత్సరాల వరకు పెండ్లిళ్లు చేసుకోవడం లేదు. కొందరైతే 40 ఏళ్ల వరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అమ్మాయికైనా, అబ్బాయికైనా ఈ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. వీర్యకణాల సంఖ్య విపరీతంగా తగ్గిపోవడం, తద్వారా సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

సరోగసీ విధానంతో పిల్లలను కనడం లాంటి మార్గాలను వెతుకుతున్నారు. సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు.  ఇద్దరికీ ప్రాబ్లం అయిన చోట వేరే వాళ్ల నుంచి ఫలదీకరణ జరిపి లిమిటెషన్ పెడుతున్నారు. ఇటీవల నెదర్లాండ్ నుంచి ఒక వ్యక్తి వీర్యం డొనెట్ చేశాడు. దాదాపు 500 మంది నుంచి 600 మంది వరకు ఆయన చేసిన వీర్యం నుంచే పుట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు సంబంధించిన దాదాపు 600 మంది పిల్లలు ఉండటం గమనార్హం.

అసలు చట్ట ప్రకారం.. ఎంతమంది ఉండాలి. ఎందరికీ వీర్యాన్ని ఇవ్వొచ్చు. అనే రూల్స్ ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. దానికి కూడా నిబంధనలు అడ్డు వస్తాయి. చట్ట ప్రకారం పిల్లలకు తండ్రిగా ఆయన్నే గుర్తించాల్సి వస్తుందని డచ్ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం కలిగిస్తోంది. ఇలాంటి పనులు ఇకపై చేయొద్దని డచ్ కోర్టు ఫెనాల్టీ విధించింది.  చట్ట ప్రకారం.. సరోగసి ద్వారా పిల్లల్నికనడానికి  కొన్ని దేశాలు ఓకే. కానీ వివిధ దేశాల్లో దీనికి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పిల్లల కోసం ఇలా వీర్యం ఇవ్వకుండా అతనిపై డచ్ కోర్టు నిషేధం విధించింది. దాదాపు 40 ఏళ్లు ఉండే వ్యక్తికి ఈ నిబంధన విధించడం సంచలనం.  పెళ్లయి.. పిల్లలు లేకపోవడానికి కారణం వీర్యకణాల్లో సామర్థ్యం లోపించడం, లేదా గర్భాశయ సమస్యలే అని తేలడం ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: