శభాష్‌ కేసీఆర్‌.. అదిరిపోయే ఉచితం ఆఫర్‌?

కేసీఆర్‌ సర్కారు మరో మంచి ఉచిత పథకం తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్స్ బుక్స్‌, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సబితా ఇంద్రారెడ్డి  అంటున్నారు. పాఠశాలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు  వర్క్ బుక్స్ ను, నోటు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆదేశించారు.

రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను బడులు ప్రారంభమయ్యే నాటికి అందచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేశారు.  రానున్న విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సర్కారు బడుల్లోని విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికి రెండు జతల యూనిఫామ్ లను అందచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

యూనిఫాంల కోసం సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నందున.. బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మన ఊరు -  మన బడి పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.  స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్ లను విద్యార్థులకు అందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మరి పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం మంచి కార్యక్రమమే కదా?

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: