భారత్‌లో బంగారం నిల్వలు ఆ రేంజ్‌లో ఉన్నాయా?

గతంలో ప్రపంచ దేశాలు భారత్ పై ఎందుకు దండయాత్రలు చేయడానికి ప్రధాన కారణం బంగారాన్ని కొల్లగొట్టి ఆయా దేశాలకు తరలించడం. ప్రతి ఆలయంలో బంగారు ఆభరణాలతో విగ్రహాలు ఉండేవి. హుండీల్లో కూడా బంగారు నాణేలు వేసేశారు. బంగారం అంటేనే భారత దేశం అని ప్రపంచం గుర్తిస్తుంటుంది. ఎందుకంటే భారతీయులు బంగారం వేసుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వేసుకోకున్నా కొనుక్కుని దాచుకోవడం ప్రతి ఒక్కరు చేసే పని.  

ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా పెరిగిపోతున్న బంగారాన్ని కొనడానికి విదేశాల్లో ఉన్న ప్రజలు  ఇష్టపడటం లేదు. కానీ ఇండియాలో మాత్రం బంగారం కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్ తర్వాత పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపునకు గురయ్యాయి.  ఆర్థిక పరిస్థితులను అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 1991 లో 67 టన్నలు బంగారాన్ని ఆర్బీఐ తాకట్టు పెట్టింది.

నాలుగేళ్లలో 178 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో భారత్ లోని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా వద్ద 8 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్యాలు, రాజులు ఆలయాలు ఉన్నసమయం నుంచే బంగారం ఇండియాలో విరివిగా లభించేది. ఇండియాపై మహమ్మదీయులు, బ్రిటిషర్లు, డచ్, ప్రెంచి వారు దాడి చేసి ఆక్రమించిన సమయంలో బంగారం, వజ్రాలు తదితర విలువైన వస్తువులు విరివిగా లభించేవని చెబుతుంటారు.

బంగారాన్ని దాచుకోవడంలో మన తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. బంగారం విలువ ఏటా పెరుగుతూనే ఉంది. సామాన్యుడు కొనలేని పరిస్థితికి వచ్చినా దాన్ని ప్రతిసారి కొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బంగారం అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక మూలస్తంభం లాంటిది. కష్టాలు వచ్చి ఆర్థికంగా పతనమైనపుడు బంగారం తో గట్టెక్కేయొచ్చనే ఆలోచనతో బంగారాన్ని ఎక్కువగా ఇండియా దాచి పెట్టుకుంటుంది. కాబట్టి బంగారం అమ్మకాల్లో ఇండియా ఎప్పుడూ టాప్ స్థానంలో ఉంటుందనేది తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: