రజనీకాంత్‌: చంద్రబాబుకు విదేశాల్లో అంత క్రేజ్‌ ఉందా?

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఇటీవల పాల్గొన్న రజినీకాంత్ బాబును పొగడ్తల్లో ముంచెత్తారు. చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ నగరంలా తీర్చిదిద్దారని పొగిడారు. ఇలాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు దేశంలోనే లేరని అన్నారు. 1997 లోనే ఆయన 2020 విజన్ అని చెప్పారు. అది ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తోందని ప్రశంసించారు. రజినీకాంత్ చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ ఎలా ఉండేదో గానీ.. ఆయన లాంటి విజన్ ఉన్న నాయకుడు మరొకరు లేరని పొగిడారు.

లక్షల మంది యువకులు ఐటీ రంగంలో పని చేస్తూ గొప్పగా జీవిస్తున్నారంటే దానికి చంద్రబాబు వేసిన పునాదేనని అన్నారు. 20 ఏళ్ల ముందు జరిగే అభివృద్ధిని ముందుగానే ఊహించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని ఆకాశానికెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు సూచించిన విజన్ 2047 గొప్ప అద్బుతమని అన్నారు. అది గనక అమలైతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన ప్రణాళికలు అమలు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు 24 గంటలు ప్రజా జీవితం గురించి ఆలోచించడం ప్రజలకు మేలు చేయడం పైనే దృష్టి సారిస్తారని అన్నారు. చంద్రబాబు ఘనత ఆయన రాజకీయ చతురత పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఇక్కడున్న వాళ్ల కంటే బయట ఉన్న వాళ్లకే చంద్రబాబు గొప్పతనం తెలుసని అన్నారు. ఐటీ రంగానికి ఇంత గొప్ప భవిష్యత్తు ఉంటుందనే అంచనా వేశారంటే అది ఆయనకే సాధ్యమని తెలిపారు. ఆయన 20, 25 ఏళ్ల కిందట చెప్పినా డిజిటల్ వరల్డ్ ను ఎవరూ ఊహించలేరని అన్నారు.

హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించిన వ్యక్తని ప్రశంసించారు. బిల్ గేట్స్ లాంటి ప్రపంచ స్థాయి వ్యాపార వేత్తను హైదరాబాద్ రప్పించి ఆయన సంస్థను ఇక్కడ పెట్టించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. ఇలా చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తడంతో టీడీపీ శ్రేణులు ఉప్పొంగి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

NTR

సంబంధిత వార్తలు: