ఇలా జరిగితే.. తెలంగాణలో బీజేపీ సర్కారు సాధ్యమే?

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా  ఇప్పుడే వివిధ రకాల జాతీయ మీడియా ఛానళ్లు సర్వే చేసేసి ఆ వివరాలను బయట పెడుతున్నాయి. ఇలా టైమ్స్ నౌ అనే మీడియా సంస్థ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బలం కాస్త తగ్గినా ఎంపీ సీట్ల పరంగా 25 కు 24 స్థానాలు గెలుచుకుని దేశంలో నే సంఖ్యా బలం ఉన్న మూడో పార్టీగా అవతరించనుందని తేల్చి చెప్పింది.

తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు 6 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే వివరాలను బయటపెట్టాయి. తెలంగాణలో బీజేపీకి 55 స్థానాలు, బీఆర్ఎస్ 25 స్థానాలు, కాంగ్రెస్ 30, ఎంఐఎం 5, బీఎస్పీ 3, ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు అయిదు సీట్ల దూరంలో నిలిచిపోతుంది.

బీజేపీని కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు బీఆర్ఎస్ తో కలవడానికైనా సిద్ధపడతాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్సీ, ఎంఐఎం కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అయితే ఈ సర్వేలకు సంబంధించి రకరకాలైన ఈక్వేషన్స్ వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లేకపోతే 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు. బీజేపీ కూడా కాస్త అటు ఇటుగా మారిన అధికారం కాస్త చేజారి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణలో బలంగా తయారవుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యన త్రిముఖ పోరు తప్పదనిపిస్తోంది. మరి ఎన్నికల సమయానికి ఎలాంటి మార్పులు వస్తాయి. జంప్ జలానీలు ఏ పార్టీల్లోకి వెళతారు. ఎవరికీ మద్దతిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: